అతి త్వరలో మనకి అందుబాటులోకి రానున్న శాటిలైట్ ఇంటర్నెట్..?!

ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరు కూడా ఇంటర్నెట్ వినియోగానికి బాగా అలవాటు పడిపోయారు.ఒక్క క్షణం కూడా ఇంటర్నెట్ లేకపోతే ఉండలేకపోతున్నారు.

 Satellite Internet Will Be Available To Us Very Soon, Satellite Internet  , Sate-TeluguStop.com

అయితే నగరాల్లో అయితే నెట్ సిగ్నల్ బానే పనిచేస్తుంది.కానీ పల్లెటూర్లలో నెట్ సిగ్నల్ అంతగా పని చేయదు.

నెట్‌ స్లోగా ఉందనో, సర్వర్‌ డౌన్ అయిందనే కంప్లైంట్స్ మనం తరుచూ వింటూనే ఉంటాము కదా.కొన్ని ఊళ్లలో అయితే పరిస్థితి మరి దారుణం అనే చెప్పాలి.కనీసం బ్రాడ్‌ బ్యాండ్‌ కనెక్షన్‌ ఉండదు.కరోనా వల్ల ఇంట్లో ఉండి పని చేసుకునే ఉద్యోగులకు, ఆన్‌లైన్ పాఠాలు వినే విద్యార్థులు ఇంటర్నెట్‌ నెట్‌వర్క్‌ బలహీనంగా ఉండడం వలన చాలా ఇబ్బందులను ఫేస్ చేసారు.

మరి అలాంటి పరిస్థితికి స్వస్తి పలుకుతూ శాటిలైట్‌ ఇంటర్నెట్‌ ప్రొవైడర్లను ఆహ్వానిస్తున్నారు.

శాటిలైట్ తోనే ఎందుకు అనే ప్రశ్నకు సమాధానంగా ఇప్పటివరకూ హైస్పీడ్‌ ఇంటర్నెట్‌ కావాలంటే ఫైబర్‌ నెట్‌ కనెక్షన్‌ ఉండాలి.

అది నగరాలూ పెద్ద పట్టణాల్లో తప్ప మారుమూల గ్రామాల్లో లేదు.అలాగే ఆ ప్రాంతాలకు ఫైబర్‌ కనెక్షన్‌ ఇచ్చేందుకు సర్వీస్‌ ప్రొవైడర్లు ముందుకు రారు.

అందువల్లనే కొండప్రాంతాల్లోని గ్రామాల్లోనైతే ఇంటర్నెట్‌ కాదు కదా సెల్‌ఫోన్లు కూడా పనిచేసే పరిస్థితి ఉండడం లేదు.శాటిలైట్‌ ఇంటర్నెట్‌తో ఆ సమస్య తీరనుంది.

అంటే నేరుగా ఆకాశంలో ఉన్న శాటిలైట్‌తో కనెక్షన్‌ కాబట్టి కొండలు, గుట్టలు, అడవులూ ఎడారులూ ఎలాంటి ప్రదేశమైనా సరే ఫైబర్‌నెట్‌ చేరుకోలేని ప్రాంతాలన్నిటికీ ఇది చేరుకుంటుంది కావున అందరు తేలిగ్గా ఇంటర్నెట్‌ వాడుకోవచ్చు.ఈ శాటిలైట్ ఎలా పనిచేస్తుంది అంటే ఇవి భూమికి దూరంగా కాక దగ్గరగా తక్కువ కక్ష్యలో(దాదాపు 550కి.

మీ.) తిరుగుతుంటాయి.దాంతో సేవలు కూడా నాణ్యంగా ఉంటాయి.

Telugu Hogh Speed Dish, Net Problems, Satellite, Speed Inernet, Villeges-Latest

ఒకరకంగా చెప్పాలంటే టీవీ డిష్‌ కనెక్షన్‌ లాగానే ఇది కూడా పనిచేస్తుంది.అయితే ఇలా శాటిలైట్‌ ఇంటర్నెట్‌ కనెక్షన్‌ తీసుకున్న వినియోగదారులు టీవీకి పెట్టుకున్నట్లే ఇంటిమీదో లేదా బయట వాకిట్లోనో చిన్న డిష్‌ లాంటి పరికరాన్ని బిగించుకోవాలి.ఆకాశంలో ఉన్న శాటిలైట్‌కీ ఈ డిష్‌కీ మధ్యలో ఎటువంటి అడ్డు అంటే చెట్లూ గాని భవనాల్లాంటివి ఉండకుండా చూసుకోవాలి.

డిష్‌ మీద మంచుపడినా కరిగిపోయేలా తయారుచేశారు.ఈ డిష్‌ కి వైఫై రూటర్‌ ని అనుసంధానిస్తారు.దాంతో కంప్యూటర్లనూ ఫోన్లనూ ఉపయోగించవచ్చు.మరి ఈ శాటిలైట్ ను ఎవరు అభివృద్ధి చేస్తున్నారంటే టెస్లా, స్పేస్‌ ఎక్స్‌ సంస్థలను నిర్వహిస్తున్న ఎలన్‌ మస్క్‌ స్పేస్‌ఎక్స్‌ ఆధ్వర్యంలో స్టార్‌ లింక్‌ అనే మరో కొత్త సంస్థని పెట్టారు.

Telugu Hogh Speed Dish, Net Problems, Satellite, Speed Inernet, Villeges-Latest

కాగా స్పేస్‌ఎక్స్‌ సంస్థ మనదేశంలో ‘స్టార్‌ లింక్‌ శాటిలైట్‌ కమ్యూనికేషన్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌’ పేరుతో అనుబంధ సంస్థని నెలకొల్పింది.లైసెన్సులూ ప్రభుత్వ అనుమతులూ సిద్ధం చేసుకుంటోంది.డీల్లీలోనూ చుట్టుపక్కలా ఉన్న వంద పాఠశాలలకు ఉచితంగా కనెక్షన్లు ఇవ్వడానికి ఈ సంస్థ ముందుకొచ్చింది.

అలాగే డేటా మీద పరిమితి లేదు.నెలకింతని ఫిక్స్‌డ్‌ ఛార్జీలు తీసుకుంటారు.

అది కూడా ప్రాంతాన్ని బట్టి ఉంటుంది.ఈ సాటిలైట్ వలన నెట్ స్పీడ్‌ ఎక్కువగా ఉంటుంది కాబట్టి.

ఎంత పెద్ద డాక్యుమెంట్లయినా సరే సెకన్లలో పంపించుకోవచ్చు.కొద్ది క్షణాల్లోనే మొత్తం సినిమా డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.

అలాగే వీడియోలు చూస్తున్నప్పుడు బఫరింగ్‌ సమస్యలు కూడా లేకుండా వీడియోలు చూస్తూ ఎంజాయ్ చేయవచ్చు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube