వామ్మో.. ఏంటి ఇలా కూడా చంపుతారా? సీరియల్ సీన్ మాములుగా లేదు!

బుల్లితెరలో ప్రసారమయ్యే సీరియల్స్ ఎక్కడ మొదలై ఏ విధంగా పూర్తవుతాయో ఎవరికీ అర్థం కాదు.కథ రసవత్తరంగా సాగుతుంది అనుకున్న సమయంలో కొన్ని ట్విస్టులు ద్వారా ఆ సీరియల్స్ ఎంతో బోర్ కొట్టే విధంగా తెరకెక్కిస్తున్నారు.

 Tv Serial Sasural Simar Ka Scenes Funny Memes In Social Media, Tv Serial Sasural-TeluguStop.com

అంతే కాకుండా కొన్ని సార్లు ఎంతో కామెడీ సన్నివేశాలను తలపిస్తున్నాయి.ఒకసారి సీరియల్ ప్రారంభమైందంటే దానిని సాగదీస్తూ దాదాపు కొన్ని సంవత్సరాలపాటు ప్రసారం చేస్తుంటారు.

సాధారణంగా సీరియల్స్ ఎప్పుడు హీరోయిన్స్ ని టార్గెట్ చేస్తూ వారికి చిత్రహింసలు పెడుతూ వారిని ఏడిపించడంమే టార్గెట్ గా సీరియల్స్ ను చిత్రీకరిస్తున్నారు.అదేవిధంగా కొన్ని సీరియల్స్ లోని సన్నివేశాలు ఎంతో కామెడీగా అనిపిస్తాయి.

తాజాగా ఓ హిందీ సీరియల్ లో ఇలాంటి కామెడీ సన్నివేశాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ప్రముఖ కలర్స్ టీవీ ఛానల్లో ప్రసారం అవుతున్న  ‘ససురాల్ సిమర్ కా’ సీరియల్ లోని కొన్ని సన్నివేశాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

ఈ వీడియోలో ఉన్న సన్నివేశం ఏమిటంటే… అమ్మమ్మ ఎంతో కోపంగా గది నుంచి బయటకు వెళుతుంది.అదే సమయంలో తన మనవరాలు తనకు క్షమాపణ చెబుతూ బయటకు వెళ్ళోద్దు అంటూ తన అమ్మమ్మ శాలువ పట్టుకొని ఆపే ప్రయత్నం చేస్తోంది.

అదే సమయంలోనే ఆమె శాలువ జారిపోవడం తన మనవరాలు బ్యాలెన్స్ తప్పి కింద పడిపోతుంది.అయితే ఈ విషయం తెలియని ఆమె శాలువ లాగుతూనే ఉంటుంది.చివరకు ఆ శాలువా ఆమె మెడకు చుట్టుకొని చనిపోతుంది.

ఈ సంఘటనకు సంబంధించిన వీడియోను No Context Violence అనే ట్విట్టర్ యూజర్ ఈ వీడియోను పోస్ట్ చేయడంతో క్షణాల్లో వైరల్ గా మారింది.ఈ వీడియో చూసిన నెటిజన్లు అందరూ మరి ఇంత కామెడీగా సీరియల్స్ తీస్తారా.అంటూ తమదైన శైలిలో కామెంట్లు పెడుతున్నారు.

మరికొంతమంది వామ్మో సీరియల్స్ లో ఇలా కూడా చంపుతారా! అంటూ మరికొంత మంది నెటిజన్లు స్పందిస్తున్నారు.మరి ఇంకెందుకు ఆలస్యం ఇంత కామెడీగా ఉన్న ఆ వీడియోను మీరు ఓ లుక్కేయండి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube