గ్రాడ్యుయేట్ ఎంటర్‌ప్రెన్యూయర్ల కోసం కెనడా ప్రావిన్స్ కొత్త ఇమ్మిగ్రేషన్ పాలసీ  

Saskatchewan Creates New Immigration Category For Graduate Entrepreneurs-

కెనడాలోని పలు ప్రావిన్సులు అంతర్జాతీయ విద్యార్ధుల కోసం వినూత్నమైన పథకాలను తీసుకొస్తున్నాయి.తాజాగా అర్హత గల పోస్ట్ సెకండరీ సంస్థల్లో వ్యాపారం ప్రారంభించాలని భావిస్తున్న అంతర్జాతీయ గ్రాడ్యుయేట్లకు సస్కట్చేవాన్ ప్రావిన్స్ తలుపులు తెరిచింది.

Saskatchewan Creates New Immigration Category For Graduate Entrepreneurs- Telugu NRI USA America Latest News (తెలుగు ప్రపంచం అంతర్జాతీయ అమెరికా ప్రవాసాంధ్రుల తాజా వార్తలు)- Visa Immigration,Events,Or-Saskatchewan Creates New Immigration Category For Graduate Entrepreneurs-

సస్కట్చేవాన్ ఇమ్మిగ్రెంట్ నామినీ ప్రోగ్రామ్ (ఎస్‌ఐఎన్‌పీ) కొత్త అంతర్జాతీయ గ్రాడ్యుయేట్ ఎంటర్‌ప్రెన్యూర్ కేటగిరీని డిసెంబర్ 3న ప్రారంభించింది.

ఈ కొత్త ఇమ్మిగ్రేషన్ విధానం ప్రకారం ఇప్పటికే తమ ప్రావిన్స్‌లోని కమ్యూనిటీలతో భాగమైన విదేశీ విద్యార్ధులు మరింత నిలదొక్కుకునేందుకు సాయపడుతుందని ఇమ్మిగ్రేషన్ అండ్ కెరీర్ ట్రైనింగ్ మంత్రి జెరెమీ హారిసన్ మీడియాతో తెలిపారు.

ఇది విద్యార్థులు కొత్తగా వ్యాపారాలు, ఉద్యోగాలను సృష్టించడానికి సహాయపడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.అలాగే అంతర్జాతీయ విద్యార్ధులను, పెట్టుబడులను ఆకర్షించడానికి సస్కట్చేవాన్ కేంద్రంగా ఉంటుందన్నారు.

ఈ ఎస్ఐఎన్‌పీ విధానం 2020 నుంచి 2030 వరకు సస్కట్చేవాన్ యెక్క వృద్ధికి సహాయపడుతుంది.తద్వారా తమ ప్రావిన్స్‌కు నిపుణులతో పాటు ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలను తరలివస్తారని హారిసన్ అభిప్రాయపడ్డారు.

సస్కట్చేవాన్ పోస్ట్ సెకండరీ ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ స్ట్రాటజీ తమ ప్రావిన్స్‌కు ఎక్కువ మంది అంతర్జాతీయ విద్యార్ధులను ఆకర్షించడమే లక్ష్యంగా పెట్టుకుందని సస్కట్చేవాన్ అడ్వాన్స్‌డ్ ఎడ్యుకేషన్ మినిస్టర్ టీనా బ్యూడ్రీ మెల్లర్ తెలిపారు.

సస్కట్చేవాన్ భవిష్యత్తు ఆర్ధిక, సాంస్కృతిక వృద్ధికి అంతర్జాతీయ (విద్యార్థి) విద్య ఒక ముఖ్యమైన డ్రైవర్ అని బ్యూడ్రీ మెల్లర్ తెలిపారు.ఈ కొత్త కేటగిరీ అంతర్జాతీయ విద్యార్ధులు తమ చదువును పూర్తి చేసిన తర్వాత సస్కట్చేవాన్‌ను వారి శాశ్వత నివాసంగా చేసుకోవటానికి సహాయపడుతుందన్నారు.అంతర్జాతీయ గ్రాడ్యుయేట్లకు ఫుల్ టైమ్, పోస్ట్ సెకండరీ డిగ్రీ, రెండు సంవత్సరాల డిప్లోమా ప్రోగ్రామ్‌లు ఉంటాయి.

ఎస్ఐఎన్‌పీ ఇంటర్నేషనల్ గ్రాడ్యుయేట్ ఎంటర్‌ప్రెన్యూర్ కేటగిరీ అభ్యర్ధులు కావాలంటే ఈ కింది అర్హతలుండాలి

* కనీసం 21 సంవత్సరాలు నిండి ఉండాలి * సస్కట్చేవాన్‌లోని అర్హత కలిగిన సంస్థ నుంచి ఫుల్ టైమ్ పోస్ట్ సెకండరీ డిగ్రీ లేదా కనీసం రెండేళ్ల డిప్లొమా పూర్తి చేయాలి * విద్యా కార్యక్రమాల కోసం సస్కట్చేవాన్‌లో నివసించాలి * కెనడియన్ లాంగ్వేజ్ బెంచ్‌మార్క్‌ను కలిగి ఉండాలి.* సస్కట్చేవాన్‌లో కెనడా ప్రభుత్వం నియమించిన లేదా గుర్తించిన పోస్ట్ సెకండరీ విద్యాసంస్థ నుంచి గ్రాడ్యుయేట్ డిగ్రీ పొందాలి.

తాజా వార్తలు