జ‌గ‌న్‌ను మించిన శ‌శిక‌ళ శ‌వ రాజ‌కీయం

స‌మైక్యాంధ్ర‌ప్ర‌దేశ్ దివంగ‌త మాజీ సీఎం వైఎస్‌.రాజ‌శేఖ‌ర్‌రెడ్డి ఆక‌స్మిక మృతి త‌ర్వాత ఆయ‌న త‌న‌యుడు, ప్ర‌స్తుత వైకాపా అధినేత వైఎస్‌.

 Sasikala Get Signs From Mlas-TeluguStop.com

జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి తండ్రి పార్థీవ దేహం సాక్షిగా శ‌వ రాజ‌కీయాలు చేశార‌న్న విమ‌ర్శ‌లు ఎదుర్కొన్నారు.వైఎస్ పార్థీవ దేహం ముందే జ‌గ‌న్ సీఎం కావాలంటూ సంత‌కాల సేక‌ర‌ణ కార్య‌క్ర‌మం జ‌రిగింది.

ఈ విష‌యంలో జ‌గ‌న్‌కు ప్ర‌మేయం ఉన్నా లేక‌పోయినా ఇదే అంశంపై జ‌గ‌న్ ఇప్ప‌ట‌కీ విమ‌ర్శ‌లు ఎదుర్కొంటూనే ఉంటున్నారు.

ఆ త‌ర్వాత కేవ‌లం సీఎం పోస్టు కోస‌మే జ‌గ‌న్ కాంగ్రెస్‌ను వీడి వైకాపాను స్థాపించార‌న్న వాద‌న‌లు కూడా ఉన్నాయి.

ఇవ‌న్నీ ఇలా ఉంటే ఇటీవ‌ల మృతిచెందిన తమిళనాడు మాజీ దివంగత ముఖ్యమంత్రి జయలలిత విష‌యంలో కూడా ఆమె నెచ్చెలి శ‌శిక‌ళ అలాంటి రాజ‌కీయాలే చేశార‌న్న వార్త‌లు వెల్ల‌వెత్తుతున్నాయి.

జ‌య‌ల‌లిత‌కు ప్రాణ స్నేహితురాలిగా ఉన్న శ‌శిక‌ళ‌పై ఇప్పటికే పలు ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో మ‌రో షాకింగ్ వార్త బ‌య‌ట‌కు వ‌చ్చింది.

జ‌య పార్థీవ దేహం ముందే శ‌శిక‌ళ రాజ‌కీయాలు న‌డిపిన‌ట్టు జాతీయ మీడియాలో క‌థ‌నాలు వ‌స్తున్నాయి.జ‌య పార్థీవ దేహం ముందే శ‌శిక‌ళ రాజ‌కీయం చేసిన‌ట్టు ఆ క‌థ‌నాలు వెల్ల‌డిస్తున్నాయి.

సీఎం ప‌ద‌వి కోసం ఆమె కొంద‌రు పార్టీ నాయ‌కుల‌ను, సీనియ‌ర్ మంత్రుల‌ను మ‌చ్చిక చేసుకుని వారి చేత తెల్లకాగితంపై సంతకాలు తీసుకుందని ఆ క‌థ‌నాలు పేర్కొంటున్నాయి.

ఎక్కువ మంది ఎమ్మెల్యేల‌తో త‌న‌కు మ‌ద్ద‌తుగా సంత‌కాలు చేయించుకుని గ‌వ‌ర్న‌ర్ స‌హాయంతో సీఎం కావాల‌న్న ఆలోచ‌న‌తోనే ఆమె ఇలా చేసిన‌ట్టు తెలుస్తోంది.

శ‌శిక‌ళ ఒత్తిడితో కొంద‌రు బ‌ల‌వంతంగా ఆమెకు అనుకూలంగా సంత‌కాలు చేసినా ఎమ్మెల్యేల్లో ఎక్కువ మంది వ్య‌తిరేక‌త వ్య‌క్తం చేయ‌డం, కేంద్ర ప్ర‌భుత్వం సైతం శ‌శిక‌ళ కంటే ప‌న్నీరు సెల్వాన్నే సీఎం కుర్చీలో కూర్చోపెట్టేందుకు మొగ్గు చూప‌డంతో ఆమె ఆట‌లు చెల్ల‌లేద‌ని అర్థ‌మ‌వుతోంది.

జ‌య అనారోగ్యంతో అన్ని రోజులు ఆస్పత్రిలో ఉన్న‌న్ని రోజులు ఎక్క‌డా క‌న‌ప‌డ‌ని శశికళ భర్త నటరాజన్, అమ్మ కన్నుమూశాక మాత్రం పక్కనే ప్రత్యక్షమయ్యాడు.

దీనిపై కూడా పలు వార్తలు వినిపోస్తున్నాయి.ఏది ఏమైనా జయకు ఎంతో విశ్వాస పాత్రురాలైన శశికళ ఇలా చేసిందని తెలిసి తమిళ ప్రజలు ఆమెపై కారాలు మిరియాలు నూరుతున్నారు.

ముందు ముందు ఈ అంశంలో ఇంకెన్ని ట్విస్టులు చోటు చేసుకుంటాయో చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube