తీర్మానంతో మండలి రద్దు అవుతుందా?

ఏపీ అసెంబ్లీలో మండలి రద్దు తీర్మానం చేశారు.రద్దుకు అసెంబ్లీలో ఓటింగ్‌ కూడా నిర్వహించడం జరిగింది.

 Sasana Mandali Andhra Ys Jagan Roja Babu Tdp-TeluguStop.com

ఓటింగ్‌ లో తెలుగు దేశం పార్టీ వారు పాల్గొనక పోవడంతో వైకాపా పూర్తి స్థాయిలో మండలి రద్దుకు ఓట్లు సాధించింది.మండలి రద్దు విషయమై చర్చించిన సమయంలో తెలుగు దేశం పార్టీ సభ్యులు వాకౌట్‌ చేయడం జరిగింది.

మండలి రద్దు విషయమై తీర్మానం చేసి దాన్ని కేంద్ర ప్రభుత్వంకు ప్రభుత్వం పంపించనుంది.నేడో రేపో అసెంబ్లీ కార్యదర్శి స్వయంగా వెళ్లి కేంద్ర హోం శాఖకు ఈ తీర్మానం అందించబోతున్నాడు.

అసెంబ్లీ తీర్మానంపై కేంద్రం ఎలా స్పందిస్తుంది అనే విషయమై ప్రస్తుతం ఆసక్తికర చర్చ జరుగుతోంది.ఒక వేళ తీర్మానంకు అనుకూలంగా ఉండి పార్లమెంటు ఉభయసభలను హాజరు పర్చి రద్దుపై చర్చ జరిపి ఓటింగ్‌ ద్వారా రద్దు బిల్లు తీసుకు వస్తే ఏపీలో మండలి అనేది కనుమరుగవ్వబోతుంది.

ఈ నేపథ్యంలో ఏపీలో ప్రస్తుతం జనసేనతో దోస్తీ కోరుకుంటున్న బీజేపీ మండలి రద్దు విషయమై ఎలాంటి నిర్ణయాన్ని తీసుకుంటుందనేది చర్చనీయాంశం అవుతుంది.ఒకవేళ మండలి రద్దుకు మోడీ ప్రభుత్వం ఓకే చెప్తే పర్వాలేదు లేదంటే అసెంబ్లీ మాదిరిగానే మండలి కూడ కొనసాగాల్సిందే అంటూ రాజకీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube