జాను, శ్రీకారం నిలబడకుంటే పరిస్థితి ఏంటి?  

Sarvanand Will Succeds From Jaanu And Srikaram - Telugu Boxer, Dil Raju. Pawan Kalyan, Fighter, Jaanu, Samantha, Sarvanand, Srikaram, జాను శ్రీకారం

కెరీర్‌ ఆరంభంలో విభిన్నమైన కథలు ఎంపిక చేసుకుని సినిమాలు చేస్తాడంటూ మంచి పేరును దక్కించుకున్న శర్వానంద్‌ ఆ తర్వాత రొటీన్‌ చిత్రాలు చేస్తూ వచ్చాడు.దాంతో కెరీర్‌లో కొన్ని ఎదురు దెబ్బలు తిన్నాడు.

Sarvanand Will Succeds From Jaanu And Srikaram

ప్రస్తుతం వరుసగా మూడు ఫ్లాప్‌లతో శర్వా ఉన్నాడు.ఇలాంటి సమయంలో ఈయన జాను చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.

రేపు విడుదల కాబోతున్న జాను చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకునే అవకాశం ఉందంటూ సినీ వర్గాల్లో అంచనాలు రేకెత్తుతున్నాయి.

జాను చిత్రంతో శర్వా సక్సెస్‌ను దక్కించుకుంటే అతడి కెరీర్‌ మళ్లీ గాడిలో పడ్డట్లే.

ఇదే సమయంలో శర్వానంద్‌ శ్రీకారం చిత్రంలో కూడా నటిస్తున్నాడు.ఇటీవలే విడుదలైన ఆ చిత్రం ఫస్ట్‌లుక్‌ అందరిని ఆకట్టుకుంటుంది.

ఒక సామాన్యమైన కుర్రాడిగా శర్వా కనిపించి మెప్పించాడు.ఫస్ట్‌లుక్‌తో ఇంప్రెస్‌ చేసిన యూనిట్‌ సభ్యులు తప్పకుండా సినిమా మెప్పిస్తుందనే నమ్మకంను వ్యక్తం చేస్తున్నారు.

ఈ రెండు చిత్రాలపై శర్వా చాలా నమ్మకం పెట్టుకుని ఉన్నాడు.జాను మరియు శ్రీకారం చిత్రాలు మూడు నెలల గ్యాప్‌లోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి.ఈ రెండు సినిమాలు మినహా శర్వా మరే సినిమాలు కూడా చేయడం లేదు.ఈ రెంటి ఫలితాల ఆధారంగా కొత్త సినిమాలను చేసే ఉద్దేశ్యంలో శర్వానంద్‌ ఉన్నట్లుగా సమాచారం అందుతోంది.

ఒక వేళ ఈ రెండు సినిమాలు కూడా నిరాశ పర్చితే ఖచ్చితంగా కొత్త తరహాలో సినిమాలు చేసేందుకు ప్రయత్నాలు చేయాలని నిర్ణయించుకున్నాడు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

footer-test