చివరి రోజుల్లో వివాదాలతో నిండిన రాజగోపాల్ జీవితం  

Sarvana Bhavan Owner P Rajagopal-

దోశ కింగ్ గా మంచి పేరున్న శరవణ భవన్ యజమాని రాజగోపాల్ రెండు రోజుల క్రితం గుండె పోటుతో మృతి చెందిన సంగతి తెలిసిందే.శరవణ స్టోర్స్ యజమానిగా రాజగోపాల్ కు ఎంత పేరుందో, ఆయన చివరి క్షణాల్లో అంతే వివాదాలకు నెలవయ్యారు.ఒక జ్యోతిషుడి సలహా మేరకు తనవద్ద పనిచేసే ఉద్యోగి కుమార్తె అయిన జీవ జ్యోతి ని రాజగోపాల్ మూడో పెళ్లి చేసుకోవాలని అనుకోవడం తో వివాదం మొదలుకుంది...

Sarvana Bhavan Owner P Rajagopal--Sarvana Bhavan Owner P Rajagopal-

అయితే విషయం తెలిసిన జీవ జ్యోతి అప్పటికే శాంతకుమార్ అనే వ్యక్తి తో ప్రేమ లో ఉండడం తో రాజగోపాల్ ప్రతిపాదనను తిరస్కరించడం ఆ తరువాత శాంతకుమార్ ను వివాహం చేసుకుంది.దీనితో కోపగించిన రాజగోపాల్ జీవ జ్యోతి భర్తను కిరాయి గుండాలతో కిడ్నాప్ చేయించి మరి దారుణంగా హత్య చేయించడం వివాదాస్పదమైంది.దీనితో తన భర్తను రాజగోపాల్ హత్య చేయించాడు అని జీవ జ్యోతి కోర్టు ను ఆశ్రయించి ఎన్ని బెదిరింపులు వచ్చినా ధైర్యంగా ఎదుర్కొని సుప్రీం కోర్టు లో రాజగోపాల్ పై విజయం సాధించింది.

Sarvana Bhavan Owner P Rajagopal--Sarvana Bhavan Owner P Rajagopal-

దీనితో రాజగోపాల్ కు జీవిత ఖైదు పడడం తో ఇటీవలే పోలీసులకు లొంగిపోయారు.అయితే ఒక్కరోజు కూడా జైలు జీవితం గడపకుండానే చనిపోవడం తో జీవ జ్యోతి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

చిన్న వయసులో భర్తను కోల్పోయినా న్యాయంగా పోరాటం చేసి రాజగోపాల్ కు జీవిత ఖైదు పడేలా పోరాడినా ఆయన ఒక్కరోజు కూడా జైలు జీవితం గడపకుండా గుండెపోటు తో మృతి చెందడం చాలా వేదనకు గురిచేస్తున్నట్లు తెలిపింది.