అల్లు అర్జున్ అతి తెలివితేటలు

సినిమా ప్రమోషన్ రాను రాను కొత్త పుంతలు తొక్కుతోంది.సినిమా పేరు జనాల్లో నానాడానికి నానా ప్రయత్నాలు చేస్తున్నారు.

 Sarrainodu Song Lekage – A Pr Stunt?-TeluguStop.com

ఎన్ని ఎత్తులైనా వేస్తున్నారు.పాజిటివ్ .నెగెటీవ్ అనే తేడా లేదు .ఎటుచేసి సినిమా గురించి జనాలు మాట్లాడుకోవాలి.

నిన్న సరైనోడు సాంగ్ ఒకటి లీక్ అయినట్లు నిర్మాతలు ప్రెస్ నోట్ వదిలేదాకా ఎవరికీ తెలియదు.పైగా ఆ లీక్డ్ సాంగ్ ని ఎక్కడైనా వాడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

ఇంకేం .ప్లాన్ సక్సెస్ .అంతా సరైనోడు గురించే చర్చించుకున్నారు.సాంగ్ లీకవలేదు అనట్లేదు కాని … మా సాంగ్ లీక్ అయ్యింది వినండి అన్నట్టుగా ప్రెస్ నోట్ వదిలి ప్రమోషన్ చేసుకున్నారు సరైనోడు మేకర్స్.

ఓరకంగా చెప్పాలంటే కావాలనే లీక్ చేసినట్టు.ఇది బన్ని పీఆర్ టీమ్ ప్లాన్ అని అభిప్రాయపడుతున్నారు సినీజనాలు.కాదేది ప్రమోషన్ కి అనర్హం.తెలివితేటలో అతితెలివితేటలో … మొత్తానికి సినిమా ప్రమోషన్ జరగాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube