సరైనోడు మూవీ రివ్యూ

వరసగా హిట్ లతో జాగ్రత్తగా సబ్జెక్ట్ లు ఎంచుకుంటూ ఒస్తున్నాడు స్టైలిష్ స్టార్ బన్నీ.మరొక పక్క ఊర మాస్ సినిమాలనే లక్ష్యంగా చేసుకుని చెలరేగుతున్నాడు డైరెక్టర్ బోయపాటి వీరిద్దరి కాంబినేషన్ లో ఒచ్చిన సరైనోడు సినిమా ఎలా ఉందొ చూద్దాం రండి.

 Sarrainodu Movie Review-TeluguStop.com

కథ


బార్డర్‍లో కంటే సమాజంలోనే ఎక్కువ సమస్యలున్నాయని చెప్పి, గన (అల్లు అర్జున్) తన మిలిటరీ ఉద్యోగాన్ని వదిలేసి హైద్రాబాద్‌లో కుటుంబంతో కలిసి జీవిస్తుంటాడు.బాబాయ్ (శ్రీకాంత్)తో కలిసి వ్యవస్థకు అందని నేరగాళ్లకు తన స్టైల్లో బుద్ధి చెప్పడమే గన పని.ఇదిలా సాగుతుండగానే, గన, తానుండే ఏరియాకి ఎమ్మెల్యే అయిన హన్షితా రెడ్డి (క్యాథరిన్ థ్రెసా)తో ప్రేమలో పడతాడు.హన్షితాతో గన పెళ్ళి ఫిక్స్ అవుతున్న సమయంలో, అతణ్ణి వెతుక్కుంటూ, కాపాడమని మహాలక్ష్మి (రకుల్ ప్రీత్) వస్తుంది.మహాలక్ష్మి కీ గన కీ ఎప్పటి నుంచీ సంబంధం ఉంది ఒకరికొకరు ఎలా తెలుసు ఆమెకి ఆపద ఒస్తే ఇతనిదగ్గరకి పరిగెత్తుకుని రావడం ఏంటి ? ఇలాంటి అనేక ప్రశ్నలకు సెకండ్ హాఫ్ సమాధానం చెబుతుంది.

పాజిటివ్ లు


అల్లూ అర్జున్ ఈ సినిమాని తన బుజాల మీద తీసుకుని వెళ్ళాడు అని చెప్పాలి ఎందుకంటే అమాంతం కథ లేకుండా డైరెక్టర్ సినిమాని మొదలు పెట్టేస్తే బన్నీ తన బాడీ లాంగ్వేజ్ తో , ఆహార్యం తో సినిమా మొత్తం చక్కగా నడిపించాడు.విలన్ ఆది పినిశెట్టిని సినిమాకు మరో హైలైట్‌గా చెప్పుకోవచ్చు.హీరోగా బాగానే మెప్పిస్తోన్న ఆది, ఈ సినిమాలో విలన్‌గా చేసి సినిమాకు మంచి స్థాయి తీసుకొచ్చాడు.ముఖ్యంగా తక్కువ మాట్లాడుతూ, స్టైలిష్‌గా కనిపిస్తూనే ఈ స్థాయి విలనిజం చూపడంలో ఆది ప్రతిభ బాగుంది.బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ చాలా చక్కగా కుదిరింది.

కాథరిన్ అందాలు కనువిందు చేసాయి.ఫైట్ లలో కామెడీ పెట్టడం తో ఫామిలీ ఆడియన్స్ కనక్ట్ అయ్యారు అని చెప్పాలి .

నెగెటివ్ లు


బోయపాటి సినిమా అనగానే అన్నిటికంటే ముందర కథ ని చూస్తారు జనం.అసలే రొటీన్ స్టోరీస్ తో విసిగిపోయిన తెలుగు జనాలకి బన్నీ మళ్ళీ అలాంటి కొత్త కథనే తీసుకొచ్చాడు , పోనీ కథనం కొత్తగా ఉందా అంటే ఇంకా రొటీన్ కథనం తో ఎలేవేషన్ లు అవసరం ఉన్నా లేకపోయినా ఇచ్చుకుంటూ వెళ్ళే సరికి సినిమా విసుగు తెప్పిస్తుంది సినిమా.పాటలు అక్కడక్కడ బాగున్నాయి అన్పించినా అక్కరలేని చోటి ఒచ్చి విసుగు తెప్పిస్తాయి అని చెప్పాలి.రెండున్నర గంటలకు పైగా చెప్పాల్సిన స్థాయి ఉన్న కథ కాకపోయినా సినిమాను అంత నిడివిలో చెప్పాలనుకోవడం అతి పెద్ద మైనస్ పాయింట్.

ఫస్ట్ హాఫ్ స్థాయి ని బాగా చూపించి దానికి కొనసాగింపు గా సెకండ్ హాఫ్ లో కథని సరిగ్గా చూపించకపోవడం బాలేదు.పూర్తి కమర్షియల్ హంగులు జేర్చడం లో అసలు కథ గాలికి వదిలేసారు

మొత్తంగా , సినిమా యావత్తూ బాగున్నట్టే కనిపించినా ఎక్కడో పంచ్ మిస్ అవుతున్నట్టు అనిపిస్తుంది.” ఎక్కడ కిక్కు లేదు సినిమా లో ” అంటాం చూసారా ఆ రకం అన్న మాట.ఒక పక్క మంచి సినిమాలు ఎంచుకుంటూ ఇలా అల్ట్రా రొటీన్ సినిమాని బన్నీ ఎందుకు ఒప్పుకున్నాడు అనేది పెద్ద క్యూస్షన్.వేరే హీరోలు ఓవర్ సీస్ ఆడియన్స్ ని మెప్పించే సినిమాలు చేస్తుంటే బన్నీ పూర్తి లోకల్ మాస్ కహానీ కి సాయి అన్నాడు.సమ్మర్ సీజన్ , అల్లూ అర్జున్ స్టామినా వలన కమర్షియల్ గా పరవాలేదు అనే రెవెన్యూ చేస్తుంది.ఖాళీగా ఉన్నప్పుడు బన్నీ నటన కోసం ఒక్కసారి చూడదగ్గ సినిమా.

రేటింగ్ :2.5/5

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube