బాహుబలిలో నటించా.. కానీ నేను ఎవరికీ తెలీదు: నటుడు

రాజమౌళి దర్శకత్వం వహించిన బాహుబలి చిత్రంలోని కాలకేయ పాత్ర అందరికీ గుర్తుండే ఉంటుంది.ఓ ఫైట్ లో భాగంగా కాలికేయ బ్యాచ్ తో ప్రభాస్, రానా పోటీపడతారు.

 John Kokken Revealed He Also Acted In Bahubali Movie, Vetapuli, Bhahubali, Sarpa-TeluguStop.com

అయితే ఈ బ్యాచ్ మొత్తానికి బాగా ప్రాచుర్యం పొందిన వ్యక్తి నటుడు ప్రభాకర్ అని చెప్పవచ్చు.కానీ ఈ బ్యాచ్ లో సారపట్ట పరంబరై ఫేమ్ జాన్ కొక్కెన్ కూడా ఉన్నార‌నే సంగ‌తి చాలా మందికి తెలియదు.

తాజాగా జాన్ ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా తెలియజేస్తూ బ్యాచ్ తో కలిసి ఉన్నటువంటి ఫోటోను షేర్ చేశారు.

ఈ విధంగా ఫోటోను షేర్ చేస్తూ ఈ విధంగా చెప్పుకొచ్చారు.

బాహుబలి సినిమా షూటింగ్ ఇప్పటికి నాకు గుర్తుందని అయితే ఆ సినిమాలో ఓ చిన్న పాత్రలో నటించానని, ఆ పాత్రలో నటించే సమయానికి నా పేరు ఎవరికీ తెలియని అయితే తొందరలోనే నా పేరు తెలిసే అవకాశం రావాలని అప్పుడు భావించానని, ప్రస్తుతం అవకాశం వచ్చిందని ఈ సందర్భంగా జాన్ కొక్కెన్ తెలియజేశారు.

Telugu Bahubali, John Kokken, Bhahubali, Nenokkadine, Vetapuli-Movie

బాహుబలిలో మాత్రమే కాకుండా ఎవడు, వన్ నేనొక్కడినే, వీరుడొక్కడే వంటి చిత్రాలలో నటించిన జాన్ కొక్కెన్ నటి పూజ రామచంద్రన్ భర్త.అయితే వీరిద్దరూ పెళ్లి చేసుకోవడానికి అంటే ముందుగా వీరు వేరే వ్యక్తులను పెళ్లి చేసుకొని కొన్ని కారణాల వల్ల విడాకులు తీసుకొని విడిపోయారు.ఈ క్రమంలోనే వీరిద్దరూ రెండో పెళ్లి చేసుకుని వైవాహిక జీవితంలో ఎంతో సుఖంగా ఉన్నారని చెప్పవచ్చు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube