అడవిలో పులి వేటను తప్పించుకోవడం అంటే అంత ఈజీ కాదనే చెప్పాలి.ఎందుకంటే దాని పంజా తగిలితే ఎంతటి బలమైన జంతువైనా సరే దానికి బలి కావాల్సిందే.
అందుకే పులి పంజాకు అంతటి పేరొచ్చిది.మరి పులిని జూల్లో చూస్తేనే మనం జడుసుకుంటాం.
ఇక రియల్‌గా మన కండ్ల ఎదుటే నిలబడితే ఇంకేమైనా ఉందా అంతే సంగతులు కదా.కానీ చాలా సార్లు మనం అటవీ గ్రామాల్లో పులి దాడులు చేసిన ఘటనలను చూస్తూనే ఉన్నాం.
ఈ దాడుల్లో పులి మనుషులను చంపి తినడాన్ని కూడా వింటూనే ఉన్నాం.
ఇక ఇప్పుడు కూడా మరోసారి పులి మన తెలంగాణ జిల్లలోని కుమురంభీం జిల్లాలో కలకలం రేపుతోంది.
కొంత కాలం క్రితం వరుస దాడులు చేస్తూ నిద్ర లేకుండా చేసిన పులి.ఇప్పుడు మళ్లీ దాడులు మొదలు పెట్టేసింది.ఈ సారి బైక్‌పై వస్తున్న గ్రామ సర్పంచ్‌పై పులి మాటువేసి ఒక్కసారిగా అటాక్ చేసింది.కుమరంభీం జిల్లాలోని పెంచికల్ పేట్ మండలంని అగార్ గూడ అనేది పూర్తిగా అటవీ గ్రామంగా ఉంటోంది.
ఈ అటవీ ప్రాంతంలో నిత్యం మనుషులు దాడులకు గురవుతున్నారు.ఇక ఇప్పుడు కూడా పెద్దపులి మోర్లిగూడ గ్రామానికి బైక్ పై వెళ్తున్న సర్పంచ్ ఈశ్వరి బాయి దాడి చేయడం కలకలం రేపుతోంది.

ఈశ్వరి బాయిపై అనూహ్యంగా దాడి చేసిన పులి దాని పంజాతో ఆమెను గాయపరిచింది. పులి పంజా బలంగా తాకడంతో ఒక్క ఉదుటన ఆమె బైక్‌పై నుంచి పడిపోయింది.కాగా బైక్ డ్రైవ్ చేస్తున్న వ్యక్తి గట్టిగా అరవడంతో ఆ పులి కాస్తా అడవిలోకి పారిపోయినట్టు వారు తెలుపుతున్నారు.ఇక ఈ దాడిలో ఆమెకు స్వల్పంగా గాయాలయ్యాయని స్థానికులు తెలిపారు.
ఇర ఇన్ని రోజులు సైలెంట్‌గానే ఉన్న గ్రామస్తులు ఇప్పుడు అలజడితో బయటకు రావాలంటేనే భయపడుతున్నారు.వెంటనే అటవీ శాఖ అధికారులు వచ్చి దాన్ని పట్టుకెల్లాలని కోరుతున్నారు.