ఆడపిల్లల రక్షణ కోసం ఓ సర్పంచ్ వినూత్న ఆలోచన.. ఏం చేస్తున్నాడంటే.. !

లోకంలో ఆడపిల్లలు అంటే చాలా అలుసు.అదీగాక అమ్మాయి పుట్టింది అనగానే ముఖం చిట్లించుకునే అత్తమామలు, భర్తలు కూడా ఉన్నారు.

 Sarpanch Giving A Gift Of Rs 5000 If A Girl Is Born-TeluguStop.com

ఆడపిల్ల అంటే గుండెల మీద కుంపటిలా భావించే సమాజంలో బ్రతుకుతున్న, కొందరికి మాత్రం కూతురంటే వల్లమాలిన ప్రేమ కూడా ఉంది.ఇక ఆడపిల్లలను భారంగా భావించి అమ్మాయి అని తెలియగానే అబార్షన్లు చేయించే ఘనులున్న ఈ సమాజంలో ఇక ఓ సర్పంచ్ ఆడపిల్ల పుడితే కానుకగా డబ్బులు అందిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు.

ఆ వివరాలు తెలుసుకుంటే.

 Sarpanch Giving A Gift Of Rs 5000 If A Girl Is Born-ఆడపిల్లల రక్షణ కోసం ఓ సర్పంచ్ వినూత్న ఆలోచన.. ఏం చేస్తున్నాడంటే.. -Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image-TeluguStop.com

తెలంగాణలోని కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని దహెగాం మండలం బీబ్రా గ్రామ సర్పంచ్ బండ కృష్ణమూర్తి ఆడపిల్లల రక్షణ కోసం వినూత్నంగా ఆలోచించాడు.ఈ ఆలోచనను అమలు చేస్తున్న క్రమంలో ఎవరికైన గ్రామ పంచాయతీలో మొదటి కాన్పుగా ఆడపిల్ల పుడితే రూ.5 వేలు చిన్నారి తల్లి పేరిట డిపాజిట్‌ చేస్తానని గ్రామస్తుల ముందు ప్రకటించారు.

చెప్పినట్టుగానే ఈ గ్రామంలోని ఏ ఇంటిలో అయినా మొదటి కాన్పులో ఆడపిల్ల పుడితే వెంటనే 5 వేలు చిన్నారి తల్లి పేరిట డిపాజిట్ చేస్తున్నారు.ఇక ఈ డబ్బులు తన సొంతంగా ఇవ్వడం విశేషం.

మాటలతో కోటలు కట్టి పబ్బం గడుపుకుంటున్న నేతలున్న ఈ సమాజంలో ఒక సర్పంచ్ స్దాయి వ్యక్తి ఇలా ఆడపిల్లల రక్షణకు నడుం బిగించడం అభినందనీయం.

#Girl Born #Asifabad #Dahegam #Sarpanch #Bibra Village

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు