ఓటర్లకు బాండ్‌ రాసిచ్చిన అభ్యర్థి... మరే రాజకీయ నాయకుడైనా ఈ సాహసం చేయగలడా?

భారత దేశంలో రాజకీయాలు బాగా ఖర్చుతో కూడుకున్నాయి.ఉన్నవాడే రాజకీయాలు చేసే పరిస్థితి.

 Sarpanch Candidate Band Paper To Voters-TeluguStop.com

సర్పంచ్‌ అవ్వాలన్నా కూడా లక్షలు ఖర్చు చేయాల్సిందే.అత్యంత దారుణమైన పరిస్థితి ఏంటీ అంటే డబ్బు పెట్టకుంటే నిజాయితీ పరుడైనా కూడా గెలిచే అవకాశం లేదు.

అందుకే నిజాయితీ పరులు కూడా తప్పని సరి పరిస్థితుల్లో డబ్బులు పెట్టాల్సి వస్తుంది.కొన్ని సార్లు డబ్బులు పెట్టినా కూడా గెలవని పరిస్థితి.

అవతలి వారు ఎక్కువ పెడితే పరిస్థితి ఏంటో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.అంతగా డబ్బు పెట్టిన వారు అక్రమాలకు పాల్పడకుండా ఎలా ఉంటారు.

డబ్బు సంపాదించకు, కేవలం ప్రజా సేవ చేయి అంటే ఎవరైనా ఊరుకుంటారా, లక్ష రూపాయలు ఖర్చు చేశాను, దానికి వడ్డితో పాటు మూడు లక్షల రూపాయలు సంపాదించుకుంటాను అంటూ డైరెక్ట్‌ చెప్పేస్తారు.అలాంటి పరిస్థితుల్లో ప్రస్తుతం రాజకీయాలు ఉన్నాయి.

ఒక వ్యక్తి ఎన్నికల్లో పోటీ చేసే సమయంలో ఆస్తులను మరియు గెలిచిన తర్వాత అయిదు సంవత్సరాలకు ఉన్న ఆస్తులను పరిగణలోకి తీసుకుంటే ఎంత మార్పు ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

అయితే నల్లగొండ జిల్లా చెర్వు అన్నారం గ్రామ సర్పంచ్‌ గా పోటీ చేసిన చిల్ముల రమణ రామస్వామి అనే వ్యక్తి గ్రామ ప్రజలకు ఒక బాండ్‌ పేపర్‌ రాసి ఇచ్చాడు.ఆ బాండ్‌ పేపర్‌లో తాను ఇప్పుడు సర్పంచ్‌గా పోటీ చేస్తున్నాను, ఒక వేళ గెలిపిస్తే ఒక్క రూపాయి కూడా అక్రమంగా సంపాదించుకోను.ఒక వేళ సంపాదించినా అయిదు ఏళ్ల తర్వాత నా యొక్క ఆస్తులను లెక్క చూసి, ఎక్కువగా ఉంటే వాటిని గ్రామ పంచాయితీ స్వాదీనం చేసుకోవచ్చు అంటూ రాసి ఇచ్చాడు.

రామస్వామి రాసిచ్చిన బాండ్‌ పేపర్‌ వైరల్‌ అయ్యింది.ఇతడు గెలిచాడో లేదో తెలియదు కాని, ఇలా నిస్వార్థంతో సేవ చేస్తానంటే మాత్రం ఓట్లు దక్కుతాయా.అసలు డబ్బులు పెట్టకుండా ఈయన గెలుస్తాడా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.ఈయన గెలిచాడా లేదా అనే విషయం మీకు తెలిస్తే కామెంట్‌ చేయండి.

ఎన్నికల్లో పోటీ చేసే ముందు మరెవ్వరికైనా ఇలా బాండ్‌ రాసిచ్చే దమ్ము ధైర్యం మరే రాజకీయ నాయకుడికైనా ఉందా చెప్పండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube