సర్కారు వారి పాట సాంగ్ లీక్.. ఇద్దరు అరెస్ట్.. వాళ్లే ఎవరంటే?

సూపర్ స్టార్ మహేష్ బాబు పరశురామ్ దర్శకత్వంలో నటిస్తున్న చిత్రం సర్కారు వారి పాట.ఈ సినిమా త్వరలోనే షూటింగ్ పూర్తి చేసుకొని వేసవి సెలవలకు విడుదల కానుంది.

 Sarkaru Vari Pata Song Leak Two Numbers Arrested Do You Know Who Are They , Sark-TeluguStop.com

ఇదిలా ఉంటే ఈ సందర్భంగా ఈ సినిమా నుంచి చిత్రబృందం కళావతి పాటను విడుదల చేయాలని అన్ని ఏర్పాట్లు చేశారు.ఈ క్రమంలోనే సినిమా అధికారికంగా విడుదల చేయడాని కంటే ముందుగా కొందరు లీకు రాయుళ్ళు ఈ సినిమాలోని కళావతి పాటను ఒకరోజు విడుదలకు ముందే సోషల్ మీడియాలో విడుదల చేయడంతో ఒక్కసారిగా చిత్ర బృందం షాకయ్యారు.

ఇలా ఎంతో కష్టపడి ఈ పాటను ఎంతో అద్భుతంగా తెరకెక్కించారు.ఇలాంటి పరిస్థితులలో ఈ పాట విడుదల చేయడాని కంటే ముందుగా లీక్ కావడంతో తమన్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తూ గుండె ముక్కలైంది అంటూ పోస్ట్ చేశారు.

ఇలా ఉండగా ఇలా ఈ పాట లీక్ కావడంతో మేకర్స్ రంగంలోకి దిగి ఈ పాట లీక్ అవడానికి కారణమైన ఇద్దరు వ్యక్తులను కనుక్కొని వారిని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో అప్పగించారు.ఈ క్రమంలోనే పోలీసులు వారిపై కేసు నమోదు చేసుకొని విచారణ కొనసాగిస్తున్నారు.

కళావతి పాట వాలెంటైన్స్ డే సందర్భంగా విడుదల కావాల్సి ఉండగా ఈ పాట ఒక రోజు ముందుగానే లీక్ అవడంతో ఆదివారమే ఈ పాటను చిత్రబృందం అధికారికంగా విడుదల చేశారు.ప్రస్తుతం ఈ పాట సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూ ఎంతో మందిని ఆకట్టుకుంది.అయితే ఇప్పటికే ఇలా ఎన్నో సినిమాల విషయంలో లీకులు జరగడం మనం చూసి ఉంటాం.ఇలాంటి సన్నివేశాలు పాటలు లీక్ కాకుండా ఉండటం కోసం మేకర్స్ ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ లీకు వీరులు మాత్రం ఏ మాత్రం తగ్గకుండా నిత్యం ఏదో ఒక సినిమా గురించి లీక్ చేస్తూ.

నిర్మాతలకు ఎన్నో ఇబ్బందులను కలుగ చేస్తున్నారు.

Sarkaru Vari Pata Song Leak Two Numbers Arrested Do You Know Who Are They , Sarkaru Vari Pata , Tollywood , Mahesh Babu , Tollywood , New Song , Leak , Two Number Arrested - Telugu Leak, Mahesh Babu, Tollywood, Number

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube