యూఎస్ లో పరుగులు పెడుతున్న సర్కారు.. అప్పుడే 1 మిలియన్ మార్క్ క్రాస్!

మన టాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ మహేష్ బాబు ఫాలోయిన్ నే వేరు.సౌత్ హీరోల్లో మహేష్ కు ఉన్న ఫాలోయింగ్ మరెవ్వరికీ లేదు అంటే నమ్మాల్సిందే.

 Sarkaru Vaari Paata Usa Box Office Details, Usa Box Office, Mahesh Babu, Sarkaru-TeluguStop.com

ఇక ఇప్పుడు ఈయన నటించిన సర్కారు వారి పాట సినిమా నిన్న గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది.సర్కారు సినిమా కరోనా కారణంగా ఇన్నాళ్ల సమయం తీసుకుంది.

నిన్న థియేటర్స్ లోకి ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకు మంచి టాక్ వచ్చింది.

ఇక యుఎస్ లో కూడా మహేష్ బాబు కి భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండడంతో ఈయన సినిమాలు అక్కడ భారీ వసూళ్లు సాధిస్తూ ఉంటాయి.

ఈయన సినిమాలు అక్కడి ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అవుతాయి.తాజాగా రిలీజ్ అయినా ఈ సినిమా కూడా అక్కడ హిట్ టాక్ తెచ్చుకుంది.ముందు నుండి ఈ సినిమాపై భారీ అంచనాలు ఉండడంతో అడ్వాన్స్ బుకింగ్స్ భారీగా జరిగాయి.

ఇప్పుడు అక్కడ వసూళ్లకు సంబంధించిన ఫైనల్ అప్డేట్ ను మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.

మహేష్ కు ఎంతో స్ట్రాంగ్ ఏరియా అయినటువంటి యూఎస్ లో ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర అనుకున్నట్టు గానే ప్రీమియర్స్, ఇంకా ఫస్ట్ డే వసూళ్లతో 1 మిలియన్ మార్క్ క్రాస్ చేసి సెన్సేషన్ నమోదు చేసింది.దీంతో ఈ సినిమా అక్కడ ఎలా ఉంటుందో అర్ధం చేసుకోవచ్చు.

ఇక ఇప్పటికే 1 మిలియన్ క్రాస్ చేసిన ఈ సినిమా వీకెండ్స్ లో బాగానే వసూళ్లు రాబట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి.మరి ఈ వీకెండ్ లో ఎలాంటి నెంబర్ నమోదు చేస్తుందో వేచి చూడాల్సిందే.ఈ సినిమాను 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్స్ వారు, మైత్రి మూవీ మేకర్స్ వారు సంయుక్తంగా నిర్మిస్తుండగా.థమన్ సంగీతం అందించాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube