సర్కారు వారి పాటలో అంతా ఉత్తుత్తే!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘సర్కారు వారి పాట’ ఇటీవల షూటింగ్‌ను మొదలెట్టిన సంగతి తెలిసిందే.ఈ సినిమాను దర్శకుడు పరశురామ్ తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

 Sarkaru Vaari Paata Rights Only Rumour, Sarkaru Vaari Paata, Mahesh Babu, Keerth-TeluguStop.com

పూర్తి కమర్షియల్ ఎంటర్‌టైనర్ మూవీగా ఈ సినిమాను తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాపై ప్రేక్షకులతో పాటు సినీ వర్గాల్లో కూడా అదిరిపోయే అంచనాలు క్రియేట్ అయ్యాయి.

అయితే ఈ సినిమాకు సంబంధించి సోషల్ మీడియాలో పలు రకాల వార్తలు వినిపిస్తున్నాయి.

ఈ క్రమంలో ఈ సినిమా డిజిటల్ అండ్ శాటిలైట్ రైట్స్ భారీ రేటుకు అమ్ముడయినట్లు చిత్ర వర్గాల్లో వార్తలు జోరుగా వినిపించాయి.అయితే ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉందా అని ప్రేక్షకులు ఆసక్తిగా చూస్తున్నారు.

కాగా ఈ వార్తలన్నీ కేవలం రూమర్లేనని, ఇంకా ఈ సినిమా హక్కులకు సంబంధించి ఎలాంటి చర్చలు జరగలేదని చిత్ర యూనిట్ అంటోంది.ఈ సినిమా రైట్స్ గురించి వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని వారు తెలిపారు.

ఇక ప్రస్తుతం షూటింగ్ మాత్రమే జరుపుకుంటున్న ఈ సినిమా హక్కులకు గురించి ఏదైనా డీల్ జరిగితే చిత్ర యూనిట్ స్వయంగా ప్రకటిస్తుందని వారు తెలిపారు.

కాగా ఆర్థిక నేరాల బ్యాక్‌డ్రాప్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మహేష్ బాబు అల్ట్రా స్టైలిష్ లుక్‌లో మనకు కనిపిస్తాడని చిత్ర యూనిట్ తెలిపింది.

ఈ సినిమా ప్రీలుక్ పోస్టర్ ఇప్పటికే ప్రేక్షకులను ఆకట్టుకున్న సంగతి తెలిసిందే.ఇక ఈ సినిమాలో అందాల భామ కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తుండటంతో వారిద్దరి మధ్య కెమిస్ట్రీ ఎలా ఉంటుందా అనే ఆసక్తి అభిమానుల్లో నెలకొంది.ఇక ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లు సంయుక్తంగా ప్రొడ్యూస్ చేస్తుండగా, ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తున్నాడు.2022 సంక్రాంతి కానుకగా ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ అనౌన్స్ చేసింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube