'సర్కారు'పై ట్రోల్స్.. ఓటిటిలో కూడా అదే స్పందన?

సూపర్ స్టార్ మహేష్ బాబు ఇటీవలే సర్కారు వారి పాట సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది.

 Sarkaru Vaari Paata Ott Release Details, Mahesh Babu, Sarkaru Vaari Paata, Ott R-TeluguStop.com

మహేష్ బాబు హీరోగా మహానటి కీర్తి సురేష్ హీరోయిన్ గా పరశురామ్ పెట్ల దర్శకత్వంలో తెరకెక్కిన ‘సర్కారు వారి పాట’ సినిమా అన్ని అడ్డంకులను దాటుకుని మే 12న గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది.మహేష్ బాబు వరుస హ్యాట్రిక్ సినిమాల తర్వాత వచ్చిన సినిమా కావడంతో ఈ సినిమాపై ముందు నుండి అంచనాలు పీక్స్ లో ఉన్నాయి.

ఇలా ఎన్నో అంచనాల మధ్య మహేష్ బాబు సర్కారు వారి పాట థియేటర్ ల లోకి వచ్చి బ్లాక్ బస్టర్ అందుకుంది.టాక్ ఎలా ఉన్న కూడా పెద్ద సినిమాలు ఏవీ లేకపోవడంతో ఈ సినిమా కలెక్షన్స్ లో దూసుకు పోయిందనే చెప్పాలి.

ఈ సినిమా రిలీజ్ అయ్యి నెల రోజులు అయ్యింది.దీంతో ఇప్పుడు ఈ సినిమా ఓటిటి లో కూడా రిలీజ్ అయ్యింది.అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ సినిమా జూన్ 23 నుండి స్ట్రీమింగ్ అయ్యింది.

ఇక థియేటర్ లో ఈ సినిమా చూడని ఫ్యాన్స్ ఈ సినిమాను బాగా వీక్షిస్తున్నారు.

Telugu Amazon Prime, System, Paashuram, Keerthy Suresh, Mahesh Babu, Ott, Sarkar

అయితే థియేటర్స్ లో చూసిన ప్రేక్షకులు చేసిన కామెంట్స్ నే ఇప్పుడు ఓటిటిలో చూసిన ప్రేక్షకులు కూడా చేస్తున్నారు.అసలు మహేష్ బాబు లాంటి హీరోతో పరశురామ్ ఇలాంటి సినిమాను ఎలా చేసాడు అని అంటున్నారు.బ్యాంకుల నేపథ్యంలో తీసుకున్న ఈ కథ ఆడియెన్స్ ను అంతగా మెప్పించలేక పోయింది.

అలాగే ఈ సినిమాలో ఒక వ్యక్తి 10 వేల కోట్లు లోన్ తీసుకుని చెల్లించకపోతే ఒక అధికారిని అరెస్ట్ చేస్తారు.

ఇలా నిజజీవితంలో ఏ సందర్భంలో కూడా చేయరు.

Telugu Amazon Prime, System, Paashuram, Keerthy Suresh, Mahesh Babu, Ott, Sarkar

బ్యాంక్ ఆఫీసర్ లంచాలు తీసుకుంటేనో లేదంటే చట్టవిరుద్ధంగా చేస్తేనో తప్ప అలా అరెస్ట్ చేయరు.కానీ ఈ సినిమాలో అదే మెయిన్ పాయింట్ తో ఉండడం కూడా ట్రోల్స్ కు కారణం అవుతుంది.అలాగే తనది కానీ పగను తాను తీర్చుకోవడం కూడా ఆడియెన్స్ కు ఎక్కలేదు.

దీంతో ట్రోల్స్ తప్పడం లేదు.మహేష్ బాబు కారణంగానే ఈ సినిమా అన్ని కోట్లు వసూళ్లు చేసింది.

లేకపోతే భారీ ప్లాప్ అయ్యేది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube