జులై లో రీస్టార్ట్ కాబోతున్న సర్కారు వారి పాట !

సరిలేరు నీకెవ్వరూ సినిమాతో సూపర్ హిట్ కొట్టి మహేష్ ఫుల్ జోష్ లో ఉన్నాడు.అదే జోష్ లో ప్రస్తుతం మహేష్ బాబు సర్కారు వారి పాట సినిమా చేస్తున్నాడు.

 Sarkaru Vaari Paata Movie Reastart Soon, Mahesh Babu, Keerthy Suresh, Sarkaru Va-TeluguStop.com

కానీ కరోనా కారణంగా షూటింగ్ ఆగిపోతూ వస్తుంది. లాక్ డౌన్ తర్వాత దుబాయ్ లో ఒక షెడ్యూల్ పూర్తి చేసుకుని వచ్చారు.

ఈ షెడ్యూల్ లో కొన్ని కీలక సన్నివేశాలను డైరెక్టర్ తెరకెక్కించాడు.అయితే సెకండ్ షెడ్యూల్ కూడా దుబాయ్ లోనే జరుగుతుందని ముందుగా ప్రకటించారు.

Telugu Keerthy Suresh, Mahesh Babu, Parasuram, Sarkaruvaari-Movie

కానీ కరోనా కారణంగా దుబాయ్ లో జరగాల్సిన షూటింగ్ హైదరాబాద్ కు షిఫ్ట్ చేసారు.సెకండ్ షెడ్యూల్ స్టార్ట్ చేసి కొద్దీ రోజులకే మళ్ళీ కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఈ షెడ్యూల్ ను వాయిదా వేశారు.ఇప్పుడిప్పుడే పరిస్థితులు చక్కబడడంతో మళ్ళీ షూటింగ్ స్టార్ట్ చేయాలనీ మేకర్స్ భావిస్తున్నారు.జులై లో ఈ షెడ్యూల్ ను ప్లాన్ చేయగా త్వరలోనే మొదలు కాబోతుందని తెలుస్తుంది.

ఈ షెడ్యూల్ లో ప్రధాన తారాగణం పై కీలక సన్నివేశాలు తెరకెక్కించ బోతున్నట్టు తెలుస్తుంది.బ్యాంకింగ్ వ్యవస్థలో జరుగుతున్న అవినీతి, మోసాలు గురించి ఈ సినిమాలో చూపించబోతున్నారని తెలుస్తుంది.

ఈ సినిమాలో మహేష్ బాబు బ్యాంకు మేనేజర్ కొడుకుగా నటిస్తున్నాడు.సినిమా లో హీరోయిన్ గా కీర్తి సురేష్ నటిస్తుంది.

విలన్ గా బాలీవుడ్ హీరో అనిల్ కపూర్ నటిస్తున్నాడు.

Telugu Keerthy Suresh, Mahesh Babu, Parasuram, Sarkaruvaari-Movie

ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్, జీఎంబీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.తమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు.ఈ సినిమా ను వచ్చే సంవత్సరం 2022 సంక్రాంతికి విడుదల చేయబోతున్నారు.

మహేష్ ఈ సినిమాతో పాటు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో మరొక సినిమా చేయబోతున్నట్టు అధికారికంగా ప్రకటించారు.సర్కారు సినిమా పూర్తి చేసి ఈ సినిమాను స్టార్ట్ చేయబోతున్నాడు మహేష్.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube