సర్కారు వారి పాటకు వాయింపుడు షురూ..?  

Thaman Ready With Tunes For Sarkaru Vaari Paata, Sarkaru Vaari Paata, Mahesh Babu, Thaman, Parasuram - Telugu Mahesh Babu, Parasuram, Sarkaru Vaari Paata, Thaman

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన రీసెంట్ మూవీ సరిలేరు నీకెవ్వరు బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలవడంతో ప్రస్తుతం తన నెక్ట్స్ మూవీ ‘సర్కారు వారి పాట’ను రెడీ చేసే పనిలో పడ్డాడు.ఈ సినిమాను ఇటీవల తన తండ్రి కృష్ణ పుట్టినరోజున అనౌన్స్ చేసిన మహేష్, త్వరలోనే ఈ సినిమాను పట్టాలెక్కించేందుకు రెడీ అయ్యాడు.

 Sarkaru Vaari Paata Mahesh Babu Thaman

ఇక ఈ సినిమాను గీతాగోవిందం డైరెక్టర్ పరశురామ్ డైరెక్ట్ చేస్తుండటంతో ఈ సినిమాపై భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి.

ఈ సినిమా ప్రీలుక్ పోస్టర్‌కు అదిరిపోయే రెస్పాన్స్ రావడంతో ఈ సినిమాను అతి త్వరలో పట్టాలెక్కించేందుకు రెడీ అవుతున్నారు చిత్ర యూనిట్.

సర్కారు వారి పాటకు వాయింపుడు షురూ..-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

కాగా ఈ సినిమాకు థమన్ సంగీతం అందించనున్నట్లు చిత్ర యూనిట్ ఇప్పటికే అనౌన్స్ చేసింది.ఇటీవల అల వైకుంఠపురములో సినిమాతో తన కెరీర్ బెస్ట్ మ్యూజిక్ ఇచ్చిన థమన్, ఈ సినిమా కోసం కూడా అదే తరహా మ్యూజిక్ ఇస్తాడని అందరూ అనుకుంటున్నారు.

అయితే ఈ సినిమా కోసం థమన్ అప్పుడే పనులు కూడా మొదలుపెట్టినట్లు తెలుస్తోంది.సర్కారు వారి పాట చిత్రానికి అదిరిపోయే ట్యూన్స్ రెడీగా ఉన్నాయని థమన్ అంటున్నాడు.

లాక్‌డౌన్ పూర్తికాగానే ఈ సినిమా షూటింగ్‌ను మొదలుపెట్టేందుకు మహేష్ అండ్ టీమ్ రెడీ అవుతోంది.కాగా ఈ సినిమాలో హీరోయిన్‌ ఎవరనే విషయంపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.

ఇక ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్, జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్స్, 14 ప్లస్ రీల్స్ బ్యానర్‌లు సంయుక్తంగా ప్రొడ్యూస్ చేస్తున్నారు.మరి ఈ సినిమాతో థమన్ ఎలాంటి సంగీతం అందిస్తాడో చూడాలి.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు