సర్కారు వారి పాట ప్రారంభమయ్యేది అప్పుడే!  

Sarkaru Vaari Paata Mahesh Babu - Telugu Mahesh Babu, Parasuram, Sarkaru Vaari Paata, Tollywood News

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన సరిలేరు నీకెవ్వరు ఇటీవల రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచిన సంగతి తెలిసిందే.ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్‌గా నిలవడంతో ఈ జోష్‌లోనే తన నెక్ట్స్ మూవీని కూడా రెడీ చేసే పనిలో మహేష్ పడ్డాడు.

 Sarkaru Vaari Paata Mahesh Babu

ఇటీవల ఈ సినిమాకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్‌మెంట్‌ను ఇటీవల మహేష్ ప్రకటించాడు.

కాగా తన నెక్ట్స్ మూవీకి ‘సర్కారు వారి పాట’ అనే ఇంట్రెస్టింగ్ టైటిల్‌ను పెట్టిన చిత్ర యూనిట్ లాక్‌డౌన్ తరువాత ఈ సినిమాను పట్టాలెక్కించేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.

సర్కారు వారి పాట ప్రారంభమయ్యేది అప్పుడే-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

గీతాగోవిందంతో సూపర్ సక్సెస్ అందుకున్న డైరెక్టర్ పరశురామ్ డైరెక్షన్‌లో ఈ సినిమా ఉండబోతున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది.కాగా ఈ సినిమాలో మహేష్ చాలా అల్ట్రా మోడ్రన్ లుక్‌లో మనకు కనిపిస్తాడని, ఈ చిత్ర ప్రీలుక్ పోస్టర్ చూస్తే తెలుస్తోంది.

అయితే ఈ సినిమా షూటింగ్‌ను లాక్‌డౌన్ తరువాత మొదలుపెట్టాలని చిత్ర యూనిట్ తొలుత భావించింది.

కానీ ప్రస్తుత పరిస్థితుల కారణంగా ఈ సినిమా షూటింగ్‌ను సెప్టెంబర్ రెండో వారంలో ప్రారంభించాలని చిత్ర యూనిట్ ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది.

సినిమా షూటింగ్ ప్రారంభానికి ఏమీ తొందర లేదని, పరిస్థితులు చక్కబడ్డాకే సినిమా షూటింగ్‌ను ప్రారంభిద్దామని మహేష్ తెలపడంతో చిత్ర యూనిట్ కూడా ఈ మేరకు ఓకే అన్నట్లు తెలుస్తోంది.అయితే మహేష్ నెక్ట్స్ మూవీ స్టార్ట్ అయ్యేసరికి సెప్టెంబర్ నెల వస్తుందనే వార్త ప్రస్తుతం టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Sarkaru Vaari Paata Mahesh Babu Related Telugu News,Photos/Pics,Images..

footer-test