'సర్కారు వారి బ్లాస్టర్' హై లెవల్లో ఉంటుందట.. అందుకే..!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం చేస్తున్న సినిమా సర్కారు వారి పాట.ఈ సినిమా అప్డేట్ కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

 Sarkaru Vaari Paata Latest Update-TeluguStop.com

మొత్తానికి సూపర్ స్టార్ బర్త్ డే కానుకగా ఆగస్టు 9 న అదిరిపోయే బర్త్ డే బ్లాస్టర్ రెడీ చేస్తున్నట్టు అధికారిక ప్రకటన రానే వచ్చింది.ఇప్పటి నుండే మహేష్ బాబు అభిమానులు సోషల్ మీడియాలో ఒక రేంజ్ లో సందడి చేస్తున్నారు.

పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం అభిమానులు ఎంతగా ఎదురు చూస్తున్నారో సోషల్ మీడియాలో చుస్తే ఇట్టే తెలిసి పోతుంది.అయితే తాజాగా ఇప్పుడు రానున్న అప్డేట్ ను టీజర్ లాగానో లేదంటే గ్లిమ్స్ లాగానో పిలవకుండా బ్లాస్టర్ అంటూ పిలవడం పై క్లారిటీ వచ్చేసింది.

 Sarkaru Vaari Paata Latest Update-సర్కారు వారి బ్లాస్టర్’ హై లెవల్లో ఉంటుందట.. అందుకే..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఎందుకు సర్కారు వారి బ్లాస్టర్ అంటూ ప్రోమోట్ చేస్తున్నారో అని అందరు అనుకుంటున్నారు.

Telugu Keerthy Suresh, Mahesh Babu, Mahesh Babu Birthday Update, Parasuram, Sarkaru Vaari Paata, Sarkaru Vaari Paata Latest Update, Sarkaru Vari Paata Update, Tollywood-Movie

దానికి కారణం కూడా తెలిసింది.ఎందుకంటే మహేష్ బాబు పుట్టిన రోజుకు రాబోతున్న అప్డేట్ ను బ్లాస్టర్ అని పిలవడానికి చిత్ర యూనిట్ చెబుతున్న కారణం ఏంటంటే.ఇది టీజర్, గ్లిమ్స్ కంటే కూడా హై లెవల్లో ఉంటుందట.

అందుకే వాటితో పోల్చకుండా ఈ అప్డేట్ కు బ్లాస్టర్ అని పేరు పెట్టినట్టు తెలుస్తుంది.మరి అంత బ్లాస్ట్ అయ్యే అప్డేట్ ఏమయ్యి ఉంటుందా అని అందరు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Telugu Keerthy Suresh, Mahesh Babu, Mahesh Babu Birthday Update, Parasuram, Sarkaru Vaari Paata, Sarkaru Vaari Paata Latest Update, Sarkaru Vari Paata Update, Tollywood-Movie

అది ఏంటో తెలియాలంటే మరొక నాలుగు రోజులు ఆగాల్సిందే.ఇక ఈ సినిమాలో మహేష్ కు జోడీగా కీర్తి సురేష్ నటిస్తుంది.బాలీవుడ్ హీరో అనిల్ కపూర్ ఇందులో విలన్ గా నటిస్తున్నాడు.ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్, జీఎంబీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

తమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు.ఈ సినిమాను వచ్చే సంవత్సరం 2022 సంక్రాంతికి విడుదల చేయబోతున్నారు.

#Parasuram #Keerthy Suresh #SarkaruVari #SarkaruVaari #Mahesh Babu

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు