సర్కారు వారి పాటకు ముహూర్తం ఫిక్స్

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న లేటెస్ట్ మూవీ సర్కారు వారి పాట గురించిన అప్‌డేట్‌ను చిత్ర యూనిట్ నేడు సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజును పురస్కరించుకుని అనౌన్స్ చేశారు.ఈ సినిమాకు సంబంధించిన ఈ అప్‌డేట్ కోసం మహేష్ ఫ్యాన్స్ చాలా ఆశగా ఎదురుచూశారు.

 Sarkaru Vaari Paata First Schedule From July, Sarkaru Vaari Paata, Mahesh Babu,-TeluguStop.com

అయితే వారి ఎదురుచూపులకు పూర్తి న్యాయం చేస్తూ చిత్ర యూనిట్ అదిరిపోయే టైటిల్‌తో పాటు అదరొట్టే ప్రీలుక్‌ను రిలీజ్ చేశారు.

ఈ పోస్టర్‌లో మహేష్ లుక్ చాలా అల్ట్రా మోడ్రన్‌గా ఉండనుందనే విషయం మనకు తెలుస్తోంది.

కాగా ఈ సినిమాను గీతాగోవిందం చిత్ర దర్శకుడు పరశురామ్ డైరెక్ట్ చేస్తుండటంతో ఈ సినిమాపై అప్పుడే అంచనాలు క్రియేట్ అయ్యాయి.ఇక ఈ సినిమా ఎలాంటి కథత వస్తుందా, ఇందులో మహేష్ పాత్ర ఎలా ఉండబోతుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.

ఇక ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు ప్రారంభిస్తారా అని అందరూ అనుకుంటుండగా, జూలై నెలలో ఈ సినిమాను పట్టాలెక్కించేందుకు మహేష్ అండ్ టీమ్ రెడీ అవుతోంది.

ప్రస్తుతం ఉన్న కరోనా పరిస్థితులు అప్పటివరకు కాస్త మెరుగుపడవచ్చని వారు ఆశిస్తున్నారు.

ఇక ఈ సినిమాలో హీరోయిన్, నటీనటులు ఎవరనే విషయంపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.మైత్రీ మూవీ మేకర్స్, జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్స్, 14 రీల్స్ సంయుక్తంగా ఈ సినిమాను ప్రొడ్యూస్ చేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube