బర్త్ డే బ్లాస్టర్.. సూపర్ స్టార్ పుట్టిన రోజున సర్కారు ఫస్ట్ లుక్.. !

మొత్తానికి సూపర్ స్టార్ బర్త్ డే కానుకగా అదిరిపోయే బర్త్ డే బ్లాస్టర్ రెడీ అయ్యింది.ఇప్పటి నుండే మహేష్ బాబు అభిమానులు సోషల్ మీడియాలో ఒక రేంజ్ లో సందడి చేస్తున్నారు.

 Sarkaru Vaari Paata First Look Coming Soon-TeluguStop.com

ఈ సినిమా అప్డేట్ కోసం ఫ్యాన్స్ కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు.ఇన్నాళ్లకు వాళ్ళ ఆశ తీరబోతుంది.

సర్కారు టీమ్ నుండి ఫస్ట్ లుక్ రాబోతుందని అఫిషియల్ అనౌన్స్ మెంట్ వచ్చేసింది.

 Sarkaru Vaari Paata First Look Coming Soon-బర్త్ డే బ్లాస్టర్.. సూపర్ స్టార్ పుట్టిన రోజున సర్కారు ఫస్ట్ లుక్.. -Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

దీంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీగా ఉన్నారు.ఇంకా పది రోజులు ఉండగానే ఇప్పటి నుండే సందడి చేస్తున్న ఫ్యాన్స్ కు ఈ వార్త ఇంకా బూస్ట్ ఇచ్చేలా ఉందని తెలుస్తుంది.పరశురామ్ దర్శకత్వంలో మహేష్ బాబు చేస్తున్న సర్కారు వారి పాట సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతగానో నిరీక్షిస్తున్నారు.

గత సంవత్సరం సరిలేరు నీకెవ్వరూ సినిమా విడుదల అయ్యి సూపర్ హిట్ కొట్టి అదే జోష్ లో ఈ సినిమా స్టార్ట్ చేసాడు.

కానీ కరోనా కారణంగా షూటింగ్ ఆలస్యం అవడంతో ఈ సినిమా వాయిదా పడుతూ వస్తుంది.

ఇప్పటికే ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ దుబాయ్ లో జరిగింది.సర్కారు వారి పాట సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతుంది.

ఈ సినిమా లో హీరోయిన్ గా కీర్తి సురేష్ నటిస్తుంది.బాలీవుడ్ హీరో అనిల్ కపూర్ ఇందులో విలన్ గా నటిస్తున్నాడు.

ఈ సినిమాలో బ్యాంకింగ్ వ్యవస్థలో జరుగుతున్న అవినీతి, మోసాలు గురించి చూపించబోతున్నారని తెలుస్తుంది.

అయితే ఈ సినిమా అప్డేట్ గురించి ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు.ఈ రోజు సర్కారు టీమ్ ఒక అప్డేట్ ఇచ్చింది.ఈ రోజు విడుదల చేసిన పోస్టర్ లో మహేష్ చాలా స్టైలిష్ గా ఉన్నాడు.

పోకిరి, అతిధి సినిమాల టైం లో మహేష్ ఏ లుక్ లో ఉన్నదో ఇప్పుడు అదే లుక్ లో దర్శన మిచ్చాడు.ఆగస్టు 9 మహేష్ బాబు బర్త్ డే సందర్భంగా ఆ రోజు ఈ సినిమా నుండి ఫస్ట్ లుక్ రాబోతుందని అఫిషియల్ అనౌన్స్ మెంట్ ఇచ్చారు.

https://twitter.com/ParasuramPetla/status/1421419727914631170
#Keerthy Suresh #SarkaruVaari #SarkaruVaari #Second Schedule #Mahesh Babu

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు