ఒక్క ప్రీమియర్ నుండే రికార్డ్ కలెక్షన్స్ రాబట్టిన సర్కారు.. వేట మొదలైంది..

మన టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న హీరోల్లో మోస్ట్ అందగాడు ఎవరు అంటే వినిపించే పేరు సూపర్ స్టార్ మహేష్ బాబు.ఈయన ఫాలోయిన్ నే వేరు.

 Sarkaru Vaari Paata Box Office Stupendous Collection In Usa Premieres Details, U-TeluguStop.com

సౌత్ హీరోల్లో మహేష్ కు ఉన్న ఫాలోయింగ్ మరెవ్వరికీ లేదు అంటే నమ్మాల్సిందే.ఇక ఇప్పుడు ఈయన నటించిన సర్కారు వారి పాట సినిమా ఈ రోజు గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది.

మహేష్ బాబు ఎప్పటికప్పుడు కొత్తదనం కోరుకుంటాడు.ఈయన సినిమాలంటే వైవిధ్యంగా ఉంటాయి.ప్రేక్షకులకు దగ్గరగా ఉండే కథలను మహేష్ ఎంచు కుంటాడు.ఈయన ఒక్కసారి కమిట్ అయితే వెంటనే సినిమా చేసుకుంటూ వెళ్ళిపోతాడు.

మధ్యలో ఆ సినిమాకు బ్రేకులు ఉండవు.అయితే సర్కారు సినిమా మాత్రం కరోనా కారణంగా ఇన్నాళ్ల సమయం తీసుకుంది.

ఈ రోజు థియేటర్స్ లోకి ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ టాక్ వచ్చింది.ఇప్పటికే యూఎస్ లో ప్రీమియర్స్ పడిపోయాయి.యుఎస్ లో కూడా మహేష్ బాబు కి భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండడంతో ఈయన సినిమాలు భారీ వసూళ్లు సాధిస్తూ ఉంటాయి.ఈయన సినిమాలు అక్కడి ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అవుతాయి.

ఇక తాజాగా రిలీజ్ అయినా ఈ సినిమా కూడా అక్కడ హిట్ టాక్ తెచ్చుకుంది.ముందు నుండి ఈ సినిమాపై భారీ అంచనాలు ఉండడంతో అడ్వాన్స్ బుకింగ్స్ భారీగా జరిగాయి.ఇక ఇప్పుడు ప్రీమియర్స్ వసూళ్లకు సంబంధించిన ఫైనల్ అప్డేట్ ను మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.

ఈ సినిమా అక్కడ 8 లక్షల 25 వేల డాలర్స్ ఒక్క ప్రీమియర్స్ నుండే వచ్చినట్టు తెలుస్తుంది.ఇది ఒక సాలిడ్ నెంబర్ అని చెప్పుకోవాలి.మరి ఈ సినిమా మన తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎన్ని కలెక్షన్స్ రాబడుతుందో వేచి చూడాలి.

ఇక ఈ సినిమాను 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్స్ వారు, మైత్రి మూవీ మేకర్స్ వారు సంయుక్తంగా నిర్మిస్తుండగా.థమన్ సంగీతం అందించాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube