‘సర్కార్‌’ వివాదం ముగియడం మురుగకు ఇష్టం లేదా?     2018-11-13   10:51:15  IST  Ramesh P

తమిళ స్టార్‌ హీరో విజయ్‌, స్టార్‌ డైరెక్టర్‌ మురుగదాస్‌ల కాంబినేషన్‌లో రూపొంది ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘సర్కార్‌’ చిత్రం భారీ వసూళ్లను సొంతం చేసుకున్న విషయం తెల్సిందే. ఈ చిత్రం మొదటి మూడు రోజుల్లో 150 కోట్లు వసూళ్లు చేయగా, ఆ తర్వాత తక్కువ సమయంలోనే 200 కోట్ల క్లబ్‌ లో కూడా చేరిపోయింది. ఇంత భారీ వసూళ్లు నమోదు అవ్వడానికి ప్రధాన కారణం చిత్రంపై వచ్చిన వివాదం ఒక కారణం అంటూ సినీ వర్గాల వారు నమ్ముతున్నారు. భారీ ఎత్తున ఈ చిత్రం వివాదాస్పదం అయిన విషయం తెల్సిందే.

Sarkar Movie Troubled With Anna DMK Party-Keerti Suresh Murugudas Party Theale Vijay

సినిమాలో జయలలిత మిక్సీలు, గ్రైండర్లు పంచి పెట్టి ఓట్లను దండుకున్నారు అంటూ సినిమాలో చూపించారు. దాంతో అన్నాడీఎంకే నాయకులు తీవ్ర ఆగ్రహంను వ్యక్తం చేశారు. సినిమాపై పెద్ద ఎత్తున వివాదాన్ని రేపడంతో పాటు మురుగదాస్‌ను అరెస్ట్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. దాంతో మురుగదాస్‌ ముందస్తు బెయిల్‌ ను కూడా తెచ్చుకున్నాడనే టాక్‌ వినిపిస్తుంది. పెద్ద ఎత్తున వివాదం రేగిన నేపథ్యంలో సినిమా నుండి ఆ సీన్స్‌ ను తొలగించడం జరిగింది. తాజాగా మరోసారి వివాదాన్ని రెచ్చగొట్టేందుకు మురుగదాస్‌ ప్రయత్నించాడు.

Sarkar Movie Troubled With Anna DMK Party-Keerti Suresh Murugudas Party Theale Vijay

సినిమా సక్సెస్‌ నేపథ్యంలో మురుగదాస్‌ చిత్ర యూనిట్‌ సభ్యులకు పార్టీ ఇచ్చాడు. ఆ పార్టీలో కేక్‌ కట్‌ చేయడం జరిగింది. కేక్‌ పై మిక్సీ మరియు గ్రైండర్‌ బొమ్మలను పెట్టడం జరిగింది. ఆ బొమ్మలు కాస్త మళ్లీ వివాదాన్ని రేపుతున్నాయి. మురుగదాస్‌ కావాలని ఆ వివాదాన్ని రెచ్చగొట్టాలని ప్రయత్నిస్తున్నాడు అంటూ ఆగ్రహం వ్యక్తం అవుతుంది. మురుగదాస్‌ కేక్‌ విషయమై అన్నా డీఎంకే కార్యకర్తలు మళ్లీ సీరియస్‌ అవుతున్నారు. దాంతో ఆందోళను చెలరేగితే సినిమాకు మళ్లీ ప్రీ పబ్లిసిటీ దక్కి మరోసారి మంచి వసూళ్లు వస్తాయని మురుగ భావిస్తున్నాడేమో అంటూ సినీ వర్గాల వారు అంటున్నారు.

ప్రకటన : తెలుగుస్టాప్ వెబ్ సైట్ లో పని చేయుట కొరకు అనుభవజ్ఞులైన తెలుగు కంటెంట్ రచయితలు,రాజకీయ విశ్లేషకులు,సోషల్ మీడియా ఫొటోస్/వీడియోస్ అడ్మిన్స్,వీడియో ఎడిటర్,వీడియో మేకర్స్,లైవ్ రిపోర్టర్ లు కావలెను..మీ వివరాలను telugustop@gmail.com కు మెయిల్ చేయగలరు.