‘సర్కార్‌’ వివాదం : విజయ్‌ ఫ్యాన్‌ చేసిన పనితో మరింత రచ్చ, ఏం చేశాడో తెలుసా?   Sarkar Movie Effect: Vijay Fan Breaks 'Amma' Laptop Video Goes Viral     2018-11-10   09:01:45  IST  Ramesh P

విజయ్‌, మురుగదాస్‌ల కాంబినేషన్‌లో తెరకెక్కి దీపావళి కానుకగా విడుదలైన ‘సర్కార్‌’ చిత్రం యావరేజ్‌ టాక్‌ ను దక్కించుకుంది. అయినా కూడా తమిళనాడులో ఈ చిత్రం భారీ వసూళ్లను సాధిస్తూనే ఉంది. రికార్డు స్థాయిలో వసూళ్లు నమోదు అవుతున్న ఈ సమయంలో అనూహ్యంగా సినిమాకు సంబంధించిన ఒక విషయంలో వివాదం చెలరేగింది. ఆ వివాదం ముదిరి పాకాన పడుతోంది. ఇప్పటికే సర్కార్‌ చిత్రంపై అన్నాడీఎంకే కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆగ్రహంతో ఉండగా, తాజాగా విజయ్‌ ఫ్యాన్‌ చేసిన పనితో వివాదం మరింత పెద్దది అయ్యిందని సినీ వర్గాల వారు అంటున్నారు.

సర్కార్‌ చిత్రంలో రాజకీయ నాయకులు ఉచితంగా ఇచ్చిన వస్తువులను పడేయండి అంటూ సూచించడం జరిగింది. గతంలో జయలలిత ఉచితంగా పలు పథకాలు ప్రవేశ పెట్టింది. ఆ పథకంకు వ్యతిరేకంగా సినిమాలో సీన్స్‌ ఉన్నాయని విమర్శలు వస్తున్నాయి. ఇలాంటి సమయంలో ఒక విజయ్‌ ఫ్యాన్స్‌ తనకు గతంలో జయలలిత ప్రభుత్వం ఇచ్చిన ల్యాప్‌ టాప్‌ ను పగులకొట్టాడు. ఆ ల్యాప్‌ ను పగుల కొట్టిన వ్యక్తి నేనో విజయ్‌ ఫ్యాన్‌ ను, అతడు చెప్పినట్లుగానే ప్రభుత్వం ఇచ్చిన వస్తువు నాకు వద్దు అన్నాడు. ల్యాప్‌ టాప్‌ను పగులకొడుతూ తీసుకున్న వీడియోను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయడంతో వివాదం మరింతగా ముదిరింది.

Sarkar Movie Effect: Vijay Fan Breaks 'Amma' Laptop Video Goes Viral-

ప్రభుత్వం ఇచ్చిన ల్యాప్‌ టాప్‌ ప్రభుత్వ ఆస్తితో సమానం. ఆ ల్యాప్‌ టాప్‌ను పగులకొట్టిన వ్యక్తిని వెంటనే అరెస్ట్‌ చేయాలని ప్రభుత్వం పోలీసు వారికి ఆదేశాలు జారీ చేసినట్లుగా తెలుస్తోంది. అదే సమయంలో ఇలాంటి పనులను రెచ్చగొట్టేలా చేసిన మురుగదాస్‌ ను కూడా అరెస్ట్‌ చేయాలని తమిళనాడు పోలీసు శాఖ భావిస్తుందని సినీ వర్గాల్లో టాక్‌ వినిపిస్తుంది. మొత్తానికి వివాదం మరింత ముదరడంతో మురుగదాస్‌ ముందస్తు బెయిల్‌కు ప్రయత్నాలు చేస్తున్నాడట. అధికారంలో ఉన్న అన్నాడీఎంకేపై విమర్శలు చేసిన కారణంగా ఏ సమయంలో అయినా అరెస్ట్‌ చేస్తారేమో అంటూ సర్కార్‌ చిత్ర యూనిట్‌ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ఈ వీడియో కోసం క్లిక్ చేయండి