విజయ్, మురుగదాస్‌ల కాంబినేషన్లో వచ్చిన గత చిత్రాలు మంచి విజయాలను దక్కించుకున్న కారణంగా తాజాగా వచ్చిన ‘సర్కార్’ చిత్రం కూడా భారీ బ్లాక్ బస్టర్ ఓపెనింగ్స్‌ను రాబట్టింది.సినిమాకు యావరేజ్ టాక్ వచ్చినా కూడా విజయ్, మురుగదాస్‌ల క్రేజ్ కారణంగా భారీ వసూళ్లు నమోదు అయినట్లుగా సినీ వర్గాల వారు అంటున్నారు.
కేవలం రెండు రోజుల్లో 110 కోట్ల గ్రాస్ వసూళ్లను ఈ చిత్రం సాధించింది.మూడవ రోజు ఈ చిత్రం 25 కోట్లు వసూళ్లు చేసినట్లుగా తెలుస్తోంది.
ప్రపంచ వ్యాప్తంగా దాదాపు మూడు వేల థియేటర్లలో ఈ చిత్రాన్ని విడుదల చేయడం జరిగింది.అంతకు తగ్గట్లుగానే భారీ వసూళ్లు నమోదు అవుతున్నాయి.
తమిళనాడుతో పాటు ఇతర ప్రాంతాల్లో మొదటి రోజు ఈ చిత్రం 67 కోట్లను వసూళ్లు చేయగా, రెండవ రోజు 43 కోట్లు రాబట్టింది.ఇక మూడవ రోజు 25 కోట్లను దక్కించుకోగా నాల్గవ రోజు మరియు అయిదవ రోజులు శని ఆదివారాలు అవ్వడం వల్ల మరో 60 కోట్లను సర్కార్ తన ఖాతాలో వేసుకోవడం ఖాయంగా కనిపిస్తుంది.మొత్తంగా మొదటి అయిదు రోజుల్లోనే 200 కోట్ల గ్రాస్‌కు పైగా వసూళ్లు దక్కించుకోబోతుంది.100 కోట్ల షేర్ సునాయాసంగా ఈ చిత్రం దక్కించుకున్న నేపథ్యంలో సినిమా సూపర్ హిట్ అంటూ విజయ్ ఫ్యాన్స్ సంబురాలు చేసుకుంటున్నారు.
ఇక తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే విజయ్‌కి పెద్దగా క్రేజ్ లేదు.దాంతో ఇక్కడ విజయ్ సర్కార్ సినిమా కేవలం ఏడు కోట్ల బిజినెస్ మాత్రమే చేసింది.కాని అనూహ్యంగా రెండు రోజుల్లోనే ఈ చిత్రం ఏకంగా 3.8 షేర్ ను దక్కించుకుంది.ఆదివారం ముగిసేప్పటికి తెలుగు రైట్స్ దక్కించుకున్న నిర్మాత సేఫ్ జోన్లోకి వెళ్లడం ఖాయంగా కనిపిస్తుంది.భారీ అంచనాల నడుమ విడుదలైన సర్కార్ చిత్రం నిరాశ పర్చిందని ఒక వైపు ప్రచారం జరుగుతున్నా మరో వైపు సినిమా మంచి వసూళ్లను దక్కించుకుంటూ దూసుకు పోతుంది.