శ్రీవారి సేవలో మహేష్ బాబు అండ్ టీమ్.....  

sarileru nikevvaru mahesh babu vijaya shanthi tirumaladevastanam - Telugu Anil Ravipudi, Mahesh Babu, Mahesh Babu News, Mahesh Babu Sarileru Nikevvaru, Mahesh Babu Visits Tirupati, Rajendra Prasad, Vijayashanthi

తాజాగా టాలీవుడ్ సూపర్ స్టార్ ప్రిన్స్ మహేష్ బాబు నటించినటువంటి చిత్రం సరిలేరు నీకెవ్వరు.ఈ చిత్రం మంచి బ్లాక్ బాస్టర్ అవ్వడంతో మహేష్ కెరీర్లోనే  బెస్ట్ చిత్రంగా నిలిచింది.

TeluguStop.com - Sarileru Nikevvaru Mahesh Babu Vijaya Shanthi Tirumaladevastanam

 ఈ చిత్రానికి అనిల్ రావిపుడి  దర్శకత్వం వహించగా మహేష్ బాబు సరసన రష్మిక మందాన నటించింది. అలాగే ఈ చిత్రంలో లేడీ సూపర్ స్టార్ విజయశాంతి, విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్, నటకిరీటి రాజేంద్రప్రసాద్, రావు రమేష్, సీనియర్ నటి సంగీత, తదితరులు ప్రధాన తారాగణంగా నటించారు.

అయితే భారీ అంచనాల నడుమ ప్రపంచవ్యాప్తంగా ఈ సంక్రాంతి పండుగ కానుకగా విడుదలైనటువంటి ఈ  చిత్రం అంచనాలకు తగ్గట్టుగానే థియేటర్లలో కాసుల వర్షం కురిపిస్తోంది.ఇప్పటికే పలు నాన్ బాహుబలి రికార్డులను బద్దలు కొట్టి వందకోట్ల క్లబ్ లో చేరేందుకు దూసుకుపోతుంది.

అయితే ఇది ఇలా ఉండగా ఈ చిత్రం మంచి విజయం సాధించినందుకు గాను మహేష్ బాబు, విజయశాంతి, రాజేంద్ర ప్రసాద్ మరియు దర్శకుడు అనిల్ రావిపూడి తదితరులు కలిసి తిరుమల తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు కలిసి విచ్చేశారు. దీంతో ఆలయ అధికారులు వారికి ఘనంగా స్వాగతం పలికి ప్రత్యేక పూజా కార్యక్రమాల కోసం ఏర్పాట్లు చేశాడు అనంతరం ఆలయ ప్రధాన అర్చకులు తీర్థ ప్రసాదాలు మరియు స్వామి వారి చిత్రపటాలను చిత్ర యూనిట్ సభ్యులకు అందించారు.

#Rajendra Prasad #MaheshBabu #MaheshBabu #Vijayashanthi #Mahesh Babu

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు