ఫేక్‌ కలెక్షన్స్‌లో సరిలేరు మీకెవ్వరు  

Sarileru Nekevvaru Fake Collections-mahesh Fans,sarileru Nekevvaru,social Media

సూపర్‌ స్టార్‌ మహేష్‌బాబు హీరోగా నటించిన సరిలేరు నీకెవ్వరు చిత్రం బాక్సాఫీస్‌ వద్ద భారీ వసూళ్లను నమోదు చేసింది.200 కోట్ల గ్రాస్‌ కలెక్షన్స్‌ను ఈ చిత్రం రాబట్టినట్లుగా చిత్ర యూనిట్‌ సభ్యులు ప్రకటించారు.మహేష్‌బాబు కెరీర్‌లోనే కాకుండా ఈమద్య కాలంలో వచ్చిన ఏ సినిమా కూడా ఈ స్థాయి వసూళ్లను రాబట్టలేదు అంటూ యూనిట్‌ సభ్యులు సగర్వంగా చెబుతున్నారు.వంద కోట్ల షేర్‌ను దాటి నాన్‌ బాహుబలి రికార్డును సొంతం చేసుకున్న ఈ చిత్రంతో మహేష్‌బాబు నిజంగానే సరిలేరు నీకెవ్వరు అనిపించుకున్నాడు అంటూ ఫ్యాన్స్‌ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
సరిలేరు నీకెవ్వరు చిత్ర యూనిట్‌ సభ్యులు ప్రకటించిన కలెక్షన్స్‌ను ఫేక్‌ అంటూ సోషల్‌ మీడియాలో కొందరు ప్రచారం చేస్తున్నారు.ముఖ్యంగా మెగా హీరోల డీపీలు ఉన్న ఫ్రొఫైల్స్‌లో ఎక్కువగా సరిలేరు నీకెవ్వరు చిత్రం కలెక్షన్స్‌ ఫేక్‌ అంటూ ట్వీట్స్‌ చేస్తున్నారు.

Sarileru Nekevvaru Fake Collections-Mahesh Fans Sarileru Social Media

వచ్చిన కలెక్షన్స్‌కు డబుల్‌ చేసి చెబుతున్నారు.కలెక్షన్స్‌ను ఫేక్‌గా చెప్పడంలో సరిలేరు మీకెవ్వరు అంటూ కామెంట్స్‌ చేస్తున్నారు.

నాన్‌ బాహుబలి రికార్డు కాదు కదా కనీసం గతంలో వచ్చిన మహేష్‌బాబు సినిమా వసూళ్లను కూడా సరిలేరు నీకెవ్వరు చిత్రం దాటలేక పోయిందని కొందరు అంటున్నారు.

సోషల్‌ మీడియాలో కొందరు చేస్తున్న బ్యాడ్‌ కామెంట్స్‌ను మరియు కలెక్షన్స్‌ ఫేక్‌ అంటూ ట్వీట్స్‌ చేస్తున్న వారిపై మహేష్‌బాబు ఫ్యాన్స్‌ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.సోషల్‌ మీడియాలో కారు కూతలు కూయడం కాదు.మహేష్‌ బాబు ఫ్లాప్‌ సినిమాలు కూడా రికార్డు స్థాయి వసూళ్లు నమోదు చేసిన దాఖలాలు చాలా ఉన్నాయి.

ఇక ఈ సినిమా వసూళ్లు రాబట్టడం లేదు అంటూ మీరు ప్రచారం చేసినంత మాత్రాన మాకు ఏం కాదు, జనాలు నమ్మరు అంటూ రీ కౌంటర్‌ ఇస్తున్నారు.

తాజా వార్తలు

Sarileru Nekevvaru Fake Collections-mahesh Fans,sarileru Nekevvaru,social Media Related....