మహేష్ ఫ్యాన్స్‌కు అదిరిపోయే ట్రీట్ ఇచ్చిన దర్శకుడు  

Sarileru Neekevvaru Teaser On The Way-mahesh Babu,sarileru Neekevvaru,teaser,telugu Movie News

సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తోన్న తాజా చిత్రం సరిలేరు నీకెవ్వరు ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది.ఇప్పటికే ఈ సినిమా మెజారిటీ షూటింగ్‌ను పూర్తి చేసుకుంది.

Sarileru Neekevvaru Teaser On The Way-mahesh Babu,sarileru Neekevvaru,teaser,telugu Movie News Telugu Tollywood Movie Cinema Film Latest News-Sarileru Neekevvaru Teaser On The Way-Mahesh Babu Sarileru Teaser Telugu Movie News

సంక్రాంతి బరిలో సినిమాను రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.ఈ సినిమాలో మహేష్ బాబు మిలిటరీ ఆఫీసర్ పాత్రలో నటిస్తోన్నాడు.

కాగా ఈ సినిమాకు సంబంధించిన టీజర్‌ను ఎప్పుడెప్పుడు రిలీజ్ చేస్తారా అని మహేష్ ఫ్యాన్స్ ఆతృతగా ఎదురుచూస్తున్నారు.అయితే ఈ చిత్ర టీజర్‌ను అతి త్వరలో రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర దర్శకుడు అనిల్ రావిపూడి తాజాగా వెల్లడించాడు.

ట్విట్టర్ వేదికగా ఆయన ఈ అనౌన్స్‌మెంట్ చేశాడు.‘‘సరిలేరు నీకెవ్వరు టీజర్ లోడింగ్’’ అంటూ ఆయన చేసిన ట్వీట్ కొన్ని క్షణాల్లోనే వైరల్‌గా మారింది.

ఇక మహేష్ నటిస్తోన్న ఈ సినిమా టీజర్ ఎలాంటి రికార్డులను క్రియేట్ చేస్తుందా అని సినీ విశ్లేషకులు అప్పుడే లెక్కలు వేస్తున్నారు.రష్మిక మందన హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ సినిమాను సంక్రాంతి బరిలో దించేందుకు మహేష్ అండ్ టీమ్ రెడీ అవుతున్నారు.

ఈ సినిమా విజయంపై అటు ఇండస్ట్రీ వర్గాలతో పాటు ప్రేక్షకుల్లో కూడా భారీ అంచనాలు ఏర్పడ్డాయి.