ఇండియన్ ఆర్మీని అవమానించిన మహేష్ బాబు... సోషల్ మీడియాలో ట్రోల్

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా సరిలేరు నీకెవ్వరు.ఇప్పటికే ఈ సినిమా టీజర్, సాంగ్స్ ప్రేక్షకుల ముందుకి వచ్చి ఆకట్టుకున్నాయి.

 Sarileru Neekevvaru Team Insults Indian Army And Netizens Fire-TeluguStop.com

విజయశాంతి ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో నటిస్తూ ఉండగా మహేష్ బాబు ఇందులో ఆర్మీ మేజర్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే.అయితే ఆర్మీ జవాన్లు అంటే దేహదారుఢ్యం కరెక్ట్ గా ఉంటుంది.

అలాగే క్లీన్ సేవ్ తో ఉంటారు.ఇప్పటికే నా పేరు సూర్య సినిమాలో బన్నీ ఆర్మీ ఆఫీసర్ లుక్ లో పెర్ఫెక్ట్ గా ఉన్నారు.

అయితే మహేష్ బాబు లుక్ లో మాత్రం ఆర్మీ ఆఫీసర్ లా కాకుండా ఏదో ఆర్మీ డ్రెస్ వేసుకొని కనిపించినట్లు ఉంది.ఇప్పటికే టీజర్ లో ఆర్మీ ఆఫీసర్ గా మహేష్ లుక్ పై విమర్శలు వచ్చాయి.

ఇదిలా ఉంటే ఈ సినిమా నుంచి ఆర్మీ ట్రిబ్యూట్ గా ఒక పాటని చిత్ర యూనిట్ ప్రేక్షకుల ముందుకి తీసుకురావడానికి ప్లాన్ చేస్తున్నట్లు ప్రకటించింది.దీనికి సంబంధించి ఒక పోస్టర్ ని కూడా రిలీజ్ చేశారు.

అయితే ఇప్పుడు ఈ పోస్టర్ సినిమాపై విమర్శలు రావడానికి కారణం అయ్యింది.ఈ పోస్టర్ లో ఆర్మీ యూనిఫాం లో మహేష్ ని ఫాలో అవుతూ ఉన్న ఆర్మీ గ్యాంగ్ లో ఓ వ్యక్తి గుబురు గెడ్డంతో ఉన్నాడు.

ఈ పోస్టర్‌పై సోషల్ మీడియాలో నెటిజన్లు మండిపడుతున్నారు.అసలు మీరు రిలీజ్ చేసిన పోస్టర్ లో హీరోతో సహా ఎవరు కూడా ఆర్మీ ఆఫీసర్ తరహాలో కనిపించడం లేదు.

అసలు ఆర్మీలో ఎవరైనా గెడ్డంతో ఉంటారా అంటూ ప్రశ్నిస్తున్నారు.ఇలాంటి పోస్టర్ ని రిలీజ్ చేసి మీరు ఇండియన్ ఆర్మీని అవమానించారు అంటూ కామెంట్స్ చేశారు.

మరి ఈ ట్రోల్స్ పై చిత్ర యూనిట్ ఎలా స్పందిస్తుంది అనేది వేచి చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube