సరిలేరు నీకెవ్వరు ప్రీరిలీజ్‌ వేడుకకు 'సాహో'తో పోలిక, ఎలాగంటే!

మహేష్‌బాబు 26వ చిత్రం సరిలేరు నీకెవ్వరు విడుదలకు మరో నెల రోజుల సమయం ఉంది.ఇప్పటికే సినిమా సందడి మొదలైంది.

 Sarileru Neekevvaru Sahoo Movie-TeluguStop.com

సంక్రాంతికి విడుదల కాబోతున్న ఈ సినిమా ప్రమోషన్‌ విషయంలో చాలా అగ్రెసివ్‌గా చిత్ర యూనిట్‌ సభ్యులు ఉన్నారు.విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం సరిలేరు నీకెవ్వరు సినిమా ప్రీ రిలీజ్‌ వేడుకను ఇప్పటి వరకు టాలీవుడ్‌ సినిమాలకు జరగని విధంగా నిర్వహించాలని భావిస్తున్నారట.

సాహో సినిమాకు ప్రీ రిలీజ్‌ వేడుకను చాలా గ్రాండ్‌గా రామోజీ ఫిల్మ్‌ సిటీలో నిర్వహించారు.ఆ సమయంలో సినిమాకు మంచి పబ్లిసిటీ దక్కింది.ఇప్పుడు అదే విధంగా రామోజీ ఫిల్మ్‌ సిటీలోనే సరిలేరు నీకెవ్వరు సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్‌ వేడుకను ప్లాన్‌ చేస్తున్నట్లుగా సమాచారం అందుతోంది.జనవరి 5వ తారీకున అంటే సినిమా విడుదలకు వారం రోజుల ముందు సరిలేరు నీకెవ్వరు ప్రీ రిలీజ్‌ వేడుక భారీ ఎత్తున రామోజీ ఫిల్మ్‌ సిటీలోని మెయిన్‌ గేట్‌ వద్ద నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

Telugu Mahesh Babu, Prabhas, Priyanka Reddy, Sahoo-

మహేష్‌బాబు గత చిత్రాలు హిట్‌ అవ్వడంతో పాటు ఈ సినిమాకు ఉన్న పలు ప్రత్యేకతల కారణంగా సినిమాపై హైప్‌ ఆకాశాన్ని తాకేలా ఉంది.విజయశాంతి ఈ చిత్రంలో కీలక పాత్రలో కనిపించబోతుంది.అలాగే ఈ సినిమాలో హీరోయన్‌గా రష్మిక మందన్న నటించింది.మరో ఆసక్తికర విషయం ఏంటీ అంటే ఈ చిత్రంలో బండ్ల గణేష్‌ కీలక పాత్రలో కనిపించబోతున్న విషయం తెల్సిందే.

వీరందరి కలయితో సినిమా నిజంగానే సరిలేదు నీకే సినిమా అన్నట్లుగా ఉండబోతుందని మహేష్‌బాబు ఫ్యాన్స్‌ చాలా నమ్మకంతో చెబుతున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube