ట్రై స్టేట్ తెలుగు అసోసియేషన్ సంక్రాంతి - గణతంత్ర దినోత్సవాలకు ప్రత్యేక అతిథి గా హాజరైన నిర్మాత “అనిల్ సుంకర”.... 

ఫిబ్రవరి 8న ట్రై స్టేట్ తెలుగు అసోసియేషన్ చికాగోలో సంక్రాంతి – గణతంత్ర దినోత్సవాలు పండుగను లెమన్ హిందూ టెంపుల్ ఆడిటోరియంలో ఘనంగా జరుపుకున్నారు.నూతన అధ్యక్షులు రామకృష్ణ కర్రపోల గారు జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించారు.

 Sarileru Neekevvaru Movie Producer Anil Sunkara Attend A Chicago Tta Celebratio-TeluguStop.com

టిటిఏ బోర్డు సభ్యులు ‘వందేమాతరం’ ఆలపించారు.వరుణ్ వాసిరెడ్డి ఆలపించిన ప్రార్థనతో 2.30 నిమిషాలకు మొదలై మధ్యాహ్నం కార్యక్రమం సంగీతం, సెమి క్లాసికల్ మరియు టాలీవుడ్, బాలీవుడ్ నృత్యాలు, వాయిద్య మరియు గాత్ర ప్రదర్శనలతో నిండిపోయింది.

జానకి దేవకి రామన్ వారి బృందం చేసిన చక్కని పుష్పాంజలి నాట్యంతో శాస్త్రీయ నృత్యాలు మొదలుపెట్టారు.

హృదయ్ విశ్వనాథన్ పియానో రెసిడెంటిల్ వీనుల విందు చేసింది.సునీత విస్సా ప్రగాఢ గారు తమ బాలానందం చిన్నారులతో కలిసి గానం చేసిన రామాష్టకం, గరుడ గమన, శివతాండవం, గీతాలు అందరినీ సంగీత పరవశలను చేశాయి.

గురు రాజేశ్వరి పరిటి గారి ఆధ్వర్యంలో అనిక అయ్యలరాజు ప్రియాంక అయ్యలరాజు, రిత్విక్ బాలాంత్రపు రోషిని బాలాంత్రపు, శిల్ప పార్ణంది, రమ్య, ఈశ్వరం అనన్య సంపత్ కుమార్, సదానంద్ పానుగంటి మరియు శ్యామ్ గణేష్ శ్రావణ ప్రియమైన కర్ణాటక సంగీత కీర్తనలతో అలరించారు.శోభ తమ్మున టీమ్ ప్రదర్శించిన “తందనాన అహి” అనే కూచిపూడి నృత్యంలో చిన్నారులు ఆహార్యం చూడచక్కని నృత్యంతో ముచ్చట గొలిపారు.

మరియొక విశేషమైన నృత్యం శివపంచాక్షరీతో గురు శోభ గారి టీమ్ అబ్బుర పరిచారు.

Telugu Tta Chicago, Ttachicago-

దీపి’ స్ డాన్స్ టీం భాగ్య నగేష్ టీం చక్కని దేశభక్తి కృత్యాలతో ప్రేక్షకులను అలరించారు.ఇక మన చికాగో టీం సెన్సేషన్ నందిత మరియు నిషిత మునిపల్లి, సాయి రిషిక పూల చేసిన బాలీవుడ్, టాలీవుడ్ నృత్యాలకు ప్రేక్షకులు ఈలలు, చప్పట్లతో హర్షం వ్యక్తం చేశారు.రీనా రాకర్స్ బృందం చేసిన బాలీవుడ్ హిప్ హాప్ డాన్స్ ప్రశంసలందుకుంది.

చిట్ట చివరన లేటెస్ట్ ఫ్యాషన్  షోలో సుందరులు అందరూ సందడి చేసిన ఫ్యాషన్ షో గ్రాండ్ ఫినాలే గా గెలిచింది.

ఇక ఆ సాయంత్రం జరిగిన టాలీవుడ్ సంగీత విభావరిలో చికాగో లోకల్ సింగింగ్ సెన్సేషన్ ప్రవీణ్ జాలిగామ, గారు మరియు శ్రేయ అద్దంకి, కశ్యప సినిమా పాటలతో శ్రోతలను ఉర్రూతలూగించారు.

ఇప్పుడే విడుదలైన అల వైకుంఠ పురం లో, సరిలేరు నీకెవ్వరు, లాంటి చిత్రాల లేటెస్ట్ హిట్ సాంగ్స్ కార్యక్రమానికే హైలెట్ గా నిలిచాయి.

బావర్చి రెస్టారెంట్ వారి రుచికరమైన విందు భోజనం ఈ కార్యక్రమానికి మరో ముఖ్యమైన అంశమని అందరూ సంతోషం వ్యక్తం చేశారు.

అసలు సిసలైన తెలుగు సంక్రాంతి వాకిలిని గుర్తుకు తెచ్చిన వేదిక అలంకరణ ఈ కార్యక్రమానికి మరింత శోభను తెచ్చాయని అందరూ ముక్తకంఠంతో ప్రశంసించారు.ముత్యాల ముగ్గులు, గొబ్బిళ్ళు, గోవు మహాలక్ష్మి తో వేదిక మీద చేసిన తెలుగు సంక్రాంతి అలంకరణ ఎంతో చూడముచ్చటగా చేసిన రాధిక గరిమెళ్ల మరియు ఆమె టీం, కిరణ్ గార్లను రమాదేవి, శ్రీదేవి మరియు రాజుదుర్గ గార్ల కృషిని అభిరుచిని అందరూ మెచ్చుకున్నారు.

ఇక హరిత మునపల్లి మరియు శ్రీదేవి మల్లంపల్లి ఆధ్వర్యంలో నిర్వహించిన ముగ్గుల పోటీల్లో వచ్చిన  వనితలందరూ  తమ ముగ్గులతో ఈ కళాప్రాంగణం నింపారు.అది చూసిన చిట్టి చిన్నారులు అందరూ తల్లుల వెనక చేరి తమ చిట్టి చేతులతో ముగ్గులు పెట్టి సందడి చేశారు.

అందులో కేవలం ఐదేళ్ల చిన్నారి అదితి తోట రెండవ బహుమతి గెలుచుకుని పెద్దలు అందరినీ ఆశ్చర్యపరిచింది.ఈ పోటీ విజేతల ని ముగ్గుల సందడి ని చూడాలంటే www.telugu.org వెబ్ సైట్ కి వెళ్ళి చూడవచ్చు.

వ్యాఖ్యాతలుగా ఉన్న ప్రణతి కలిగొట్ట మరియు విద్య మరువాడ సందర్భోచితంగా చలోక్తులతో కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.కొత్తగా టిటిఎ బోర్డు ప్రెసిడెంట్ గా ఎన్నికైన రామకృష్ణ గారు క్రీడాకారులకు బహుమతులు అందజేశారు.

అనంతరం 35 సంవత్సరాలుగా అమెరికాలోని తెలుగు సంస్కృతికి వారధిగా నిలుస్తున్న ఈ ట్రై స్టేట్ తెలుగు అసోసియేషన్ మెంబర్ శ్రీ యుగంధర్ యడ్లపాటి గారిని, శ్రీ గోరంట్ల చౌదరి గారిని తదితరులను ప్రస్తుత బోర్డు మెంబర్స్ సాదరంగా సత్కరించనున్నారు.అలాగే ఈ సంవత్సరం మొదటి సారిగా ఎన్నికైన కొత్త బోర్డు మెంబర్స్ అందరిని పేరుపేరునా సభకు పరిచయం చేశారు.

ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా విచ్చేసిన “సరిలేరు నీకెవ్వరు” చిత్ర నిర్మాత అనిల్ సుంకర గారు మన సంస్కృతి సాంప్రదాయాలు ప్రతిబింబిస్తూ భావితరాలకు తెలియజేసేలా చక్కటి కార్యక్రమాన్ని నిర్వహించారనీ టిటిఏ నూతన కార్యనిర్వాహక కమిటీని మరియు బోర్డు సభ్యులను ప్రశంసించారు.ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు కృషి చేసిన బోర్డు మెంబర్లు, స్పాన్సర్లు కళాకారులు వారి గురువులు కుటుంబ సభ్యులందరికీ టిటిడి బోర్డు ధన్యవాదాలు తెలుపుతుంది.

ప్రతి ఏడాది ఇలాగే మన పండుగలు అన్నింటినీ ఉత్సాహంతో జరుపుకుంటూ మన సంస్కృతిని సజీవంగా ఉంచాలని కోరుకుంటోంది.

ఆసక్తిగల చికాగో తెలుగు వారు మన

www.telugu.org

వెబ్ సైట్ కి వెళ్లి వచ్చే ఏడాది కొరకు రిజిస్టర్ చేసుకోవచ్చును.

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube