సూపర్ స్టార్ మహేష్ బాబు క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.ప్రస్తుతం టాలీవుడ్ లో నెంబర్ వన్ హీరోగా తనకంటూ ప్రత్యేక గుర్తింపుని సొంతం చేసుకున్నాడు.
ఇక అతని సినిమా వచ్చింది అంటే రిలీజ్ కి ముందు నుందే సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది.అలాగే సౌత్ ఇండియాలో అత్యధిక ఫలోవర్స్ ఉన్న హీరోలలో మహేష్ టాప్ పొజిషన్ లో ఉన్నాడు.
పాన్ ఇండియా స్టార్ కాకపోయినా ఏకంగా వంద కోట్లకి పైగా బిజినెస్ ఉన్న హీరోగా మహేష్ బాబు ఉన్నాడు.అతనితో సినిమాలు చేయడానికి చాలా మంది నిర్మాతలు, దర్శకులు ఎదురుచూస్తూ ఉంటారు.
ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు సర్కారువారి పాట సినిమా కోసం సన్నద్ధం అవుతున్నారు.జనవరి ఫెస్టివల్ తర్వాత ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుంది.
ఇదిలా ఉంటే మహేష్ బాబు ఇప్పుడు ట్విట్టర్ లో మరో అరుదైన రికార్డుని తన ఖాతాలో వేసుకున్నాడు.
ట్విట్టర్ లో ట్రెండింగ్ లో నిలిచిన తెలుగు సినిమాల జాబితాలో సరిలేరు నీకెవ్వరూ సినిమా తొలి స్థానంలో నిలిచింది.దాంతో పాటు అత్యధిక హ్యాష్ ట్యాగ్ లు సాధించిన చిత్రంగానూ ఈ సూపర్ హిట్ సినిమా రికార్డు కొట్టింది.ఇక దేశవ్యాప్తంగా చూస్తే మూడవ స్థానంలో నిలిచింది.
సుశాంత్ నటించిన దిల్ బేచారా, సూర్య హీరోగా వచ్చిన సూరారై పొట్రు మొదటి, రెండు స్థానాలలో ఉండగా సరిలేరు నీకెవ్వరు సినిమా మూడో స్థానంలో ఉండటం విశేషం.ఇలా రికార్డుల మీద రికార్డులు క్రియేట్ చేస్తున్న సూపర్ స్టార్ మహేష్ బాబు రాజమౌళి దర్శకత్వంలో చేయబోయే పాన్ ఇండియా మూవీ కోసం చాలా మంది ఆత్రుతగా ఎదురుచూస్తూ ఉన్నారు.