దీపావళికి వచ్చేది మహేష్ కాదు.. లేడీ అమితాబ్!

సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తోన్న లేటెస్ట్ మూవీ సరిలేరు నీకెవ్వరూ సంక్రాంతి కానుకగా గ్రాండ్ రిలీజ్‌కు రెడీ అయ్యింది.ఇప్పటికే ఈ సినిమాపై అటు ఇండస్ట్రీ వర్గాలతో పాటు ప్రేక్షకుల్లో మంచి బజ్ క్రియేట్ అయ్యింది.

 Sarileru Neekevvaru Gift Of Vijayashanthi Look On Diwali-TeluguStop.com

ఇక ఇటీవల రిలీజ్ అయిన వరుస పోస్టర్లు సినిమాపై మరింత ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.

ఇకపోతే ప్రతి పండగకు పెద్ద హీరోలు తమ సినిమాలకు సంబంధించిన ఏదో ఓ గిఫ్ట్ అభిమానుల కోసం సిద్ధం చేస్తుంటారు.

ఇటీవల స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తన లేటెస్ట్ మూవీ ‘అల వైకుంఠపురములో’ నుంచి దీపావళి కానుకగా ‘రాములో రాములా.’ అనే పాటను రిలీజ్ చేస్తున్నట్లు అనౌన్స్ చేశారు.

దీంతో మహేష్ నటిస్తోన్న సరిలేరు నీకెవ్వరు చిత్రం నుంచి ఎలాంటి గిఫ్ట్ అభిమానులను అలరిస్తుందా అని ఆసక్తిగా చూస్తున్నారు అందరూ.

అయితే ఈ దీపావళికి మహేష్ చిత్రం నుండి మహేష్‌కు సంబంధించిన ఎలాంటి గిఫ్ట్ ఉండబోదట.

కానీ ఈ సినిమాతో రీఎంట్రీ ఇస్తోన్న లేడీ అమితాబ్ విజయశాంతికి సంబంధించిన ఫస్ట్ లుక్‌ను చిత్ర యూనిట్ రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది.ఒకప్పటి స్టార్ హీరోయిన్ విజయశాంతికి ఉన్న క్రేజ్ ఎలాంటిదో అందిరికీ తెలిసిందే.

ఇప్పుడు చాలా కాలం తరువాత రీఎంట్రీ ఇవ్వబోతున్న ఈ లేడీ అమితాబ్ అదేనండీ మన రాములమ్మ ఫస్ట్ లుక్ పోస్టర్ ఎలా ఉంటుందా అని ఆసక్తిగా చూస్తున్నారు సినీ ప్రేక్షకులు.

Telugu Diwali, Mahesh Babu, Vijayashanthi-

ఇక మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు, అల్లు అర్జున్ నటిస్తోన్న అల వైకుంఠపురుములో చిత్రాలు సంక్రాంతి బరిలో పోటీ పడనున్నాయి.ఈ రెండు సినిమాల్లో ఏ సినిమా విజేతగా నిలుస్తుందనే అంశం మాత్రం సినిమాల విడుదల తరువాతే తెలుస్తుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube