సరిలేరు నీకెవ్వరు తొలిరోజు కలెక్షన్లు.. ఎంతో తెలుసా?  

Sarileru Neekevvaru First Day Telugu States Collections-mahesh Babu,rashmika Mandanna,sarileru Neekevvaru,sarileru Neekevvaru Collections

సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన లేటెస్ట్ మూవీ సరిలేరు నీకెవ్వరు భారీ అంచనాల నడుమ అంతే భారీ స్థాయిలో ప్రపంచవ్యాప్తంగా నిన్న(శనివారం) రిలీజ్ అయ్యింది.ఈ సినిమాతో మహేష్ ఇండస్ట్రీ హిట్ కొట్టడం ఖాయమని చిత్ర యూనిట్‌తో పాటు ఇండస్ట్రీ వర్గాలు సైతం జోస్యం చెప్పాయి.

Sarileru Neekevvaru First Day Telugu States Collections-Mahesh Babu Rashmika Mandanna Sarileru Collections

అయితే సినిమాకు మంచి టాక్ రావడంతో వారి జోస్యం నిజం కావడం ఖాయమని అనుకున్నారు అందరూ.

కానీ సినిమాలో వావ్ ఎలిమెంట్స్ ఏమీ లేకపోయినా, రొటీన్ కథను కొత్తగా ప్రెజెంట్ చేయడంతో మహేష్ సినిమాకు వసూళ్లు అనుకున్న స్థాయికంటే ఎక్కువే వచ్చాయి.ఈ సినిమాకు తొలిరోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి ఏకంగా రూ.32.77 కోట్లు కలెక్షన్లు వచ్చాయి.తెలుగు రాష్ట్రాల్లో ఇంతమొత్తం స్థాయిలో వసూళ్లు సాధించిన నాలుగో చిత్రంగా ఆల్‌టైమ్ రికార్డును క్రియేట్ చేసింది.మహర్షి సినిమా సాధించిన రూ.23.72 కోట్లను కూడా క్రాస్ చేయడంతో మహేష్ కెరీర్‌లోనే బెస్ట్ ఓపెనింగ్స్ సాధించిన చిత్రంగా ఈ సినిమా రికార్డు క్రియేట్ చేసింది.

ఇక ఏరియాల వారీగా ఈ సినిమా కలెక్ట్ చేసిన తొలిరోజు షేర్ కలెక్షన్లు ఈ విధంగా ఉన్నాయి.

నైజాం – 8.66 కోట్లు

సీడెడ్ – 4.15 కోట్లు

ఉత్తరాంధ్ర – 4.40 కోట్లు

ఈస్ట్ – 3.35 కోట్లు

వెస్ట్ – 2.72 కోట్లు

గుంటూరు – 5.14 కోట్లు

కృష్ణా – 3.07 కోట్లు

నెల్లూరు – 1.27 కోట్లు

టోటల్ ఏపీ+తెలంగాణ – రూ.32.77 కోట్లు

తాజా వార్తలు

Sarileru Neekevvaru First Day Telugu States Collections-mahesh Babu,rashmika Mandanna,sarileru Neekevvaru,sarileru Neekevvaru Collections Related....