నైజాంలో మహేష్ నాలుగో సారి... ఎవరికీ సాధ్యం కాని ఫీట్  

Sarileru Neekevvaru Creates New Record In Nizam-maharshi Movie,nizam,sarileru Neekevvaru,tollywood

స్టార్ హీరో మహేష్ వారు ఈ మధ్య కాలంలో వరుస హిట్స్ తో దూసుకుపోతున్నాడు.భరత్ అనే నేను, మహర్షి, తాజాగా సరిలేరు నీకెవ్వరు సినిమాతో హ్యాట్రిక్ విజయాలతో తన ఖాతాలో వేసుకున్నాడు.

Sarileru Neekevvaru Creates New Record In Nizam-maharshi Movie,nizam,sarileru Neekevvaru,tollywood Telugu Tollywood Movie Cinema Film Latest News-Sarileru Neekevvaru Creates New Record In Nizam-Maharshi Movie Nizam Sarileru Tollywood

బడ్జెట్ ఎంతైనా ఈ మధ్య కాలంలో తన ప్రతి సినిమా కలెక్షన్ వంద కోట్లు దాటిపోతుంది.దీంతో టాలీవుడ్ లో వరుసగా ఈ మార్క్ అందుకుంటున్న హీరోగా సూపర్ స్టార్ మహేష్ బాబు నిలిచిపోయాడని చెప్పాలి.

ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన సరిలేరు నీకెవ్వరు సినిమాతో మరో హిట్ ని తన ఖాతాలో వేసుకున్న మహేష్ కలెక్షన్స్ తో రికార్డ్స్ సృష్టిస్తున్నాడు.

రెండు తెలుగు రాష్ట్రాలలో 68.22 కోట్ల షేర్ రాబట్టి వంద కోట్ల వైపు పరుగులు పెడుతున్న ఈ సినిమా ఇప్పటికే వంద కోట్లకు పైగా గ్రాస్ కలెక్ట్ చేసేసింది.ఈ చిత్రంతో మహేష్ నైజాంలో ఓ అరుదైన రికార్డు క్రియేట్ చేశాడు.

నాలుగు సార్లు 20కోట్లకు పైగా షేర్ సాధించిన హీరోగా తన పేరు నమోదు చేస్తుకున్నారు.గతంలో మహేష్ నటించిన శ్రీమంతుడు, భరత్ అనే నేను, మహర్షి సినిమాలు నైజాంలో 20 కోట్లకు పైగా షేర్లు సాధించాయి.ఇక తాజా చిత్రం సరిలేరు నీకెవ్వరు ఐదు రోజులకే నైజాంలో 22.5 కోట్ల షేర్ రాబట్టింది.దీనితో నాలుగు సార్లు నైజాంలో 20కోట్లకు పైగా షేర్ వసూలు చేసి అరుదైన రికార్డ్ ని సొంతం చేసుకున్నాడు.మహర్షి 30కోట్లకు పైగా షేర్ నైజాం లో ఇప్పటి వరకు హైయెస్ట్ గా ఉంది.

మరి దీనిని సరిలేరు నీకెవ్వరు సినిమాతో మహేష్ బాబు బీట్ చేసే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి.మరి అది ఎంత వరకు సాధ్యం అవుతుంది అనేది వేచి చూడాలి

.

తాజా వార్తలు