సరిలేరు నీకెవ్వరు 6 రోజుల కలెక్షన్లు.. ఎంతో తెలుసా?  

Sarileru Neekevvaru 6 Days Collections-collections,mahesh Babu,rashmika Mandanna,sarileru Neekevvaru,vijayashanti

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన లేటెస్ట్ ఎంటర్‌టైనర్ సరిలేరు నీకెవ్వరు సంక్రాంతి కానుకగా భారీ అంచనాల నడుమ జనవరి 11న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయిన సంగతి తెలిసిందే.మొదటి రోజు నుండే ఈ సినిమాకు హిట్ టాక్ రావడంతో మహేష్ ఫ్యాన్స్ సంక్రాంతి పండుగ ముందే వచ్చిందంటూ వేడుకలు చేసుకున్నారు.

Sarileru Neekevvaru 6 Days Collections-Collections Mahesh Babu Rashmika Mandanna Sarileru Vijayashanti

దర్శకుడు అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో పక్కా కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమాలో మహేష్ బాబు యాక్టింగ్‌తో ఫ్యాన్స్‌కు అసలైన పండగ గిఫ్ట్ ఇచ్చాడంటూ సినీ విశ్లేషకులు అన్నారు.ఇక ఈ సినిమా అనుకున్నట్లుగానే భారీస్థాయిలో కలెక్షన్లు రాబడుతూ సంక్రాంతి పండగను కొనసాగిస్తోంది.ఈ సినిమా ఆరు రోజులు ముగిసేసరికి రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి ఏకంగా రూ.77.94 కోట్లు కొల్లగొట్టింది.

మహేష్ యాక్టింగ్‌కు విజయశాంతి పవర్‌ఫుల్ రీఎంట్రీ, రష్మిక మందన్న అందాలు, అనిల్ రావిపూడి కథనం తోడవడంతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సరిలేరు నీకెవ్వరు అంటూ దూసుకుపోతంది.

ఇక ఏరియాలవారీగా ఈ సినిమా 6 రోజుల కలెక్షన్లు ఈ విధంగా ఉన్నాయి.

నైజం – 25.65 కోట్లు

సీడెడ్ – 11.35 కోట్లు

నెల్లూరు – 2.86 కోట్లు

కృష్ణా – 6.27 కోట్లు

గుంటూరు – 7.72 కోట్లు

వైజాగ్ – 11.80 కోట్లు

ఈస్ట్ – 7.23 కోట్లు

వెస్ట్ – 5.06 కోట్లు

టోటల్ ఏపీ+తెలంగాణ – 77.94 కోట్లు

తాజా వార్తలు