సరిలేరు నీకెవ్వరు 37 రోజుల వరల్డ్‌వైడ్ కలెక్షన్లు.. ఎంతంటే?  

Sarileru Neekevvaru 37 Days Worldwide Collections - Telugu Anil Ravipudi, Collections, Mahesh Babu, Sarileru Neekevvaru, Telugu Movie News

సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన లేటెస్ట్ మూవీ సరిలేరు నీకెవ్వరు సంక్రాంతి కానుకగా జనవరి 11న ప్రపంచ వ్యాప్తంగా భారీ అంచనాల నడుమ రిలీజ్ అయ్యింది.ఈ సినిమాకు తొలిరోజే అన్ని చోట్ల అదిరిపోయే టాక్ రావడంతో ఈ సినిమా కలెక్షన్లు కూడా సూపర్‌గా వచ్చాయి.

Sarileru Neekevvaru 37 Days Worldwide Collections - Telugu Anil Ravipudi, Collections, Mahesh Babu, Sarileru Neekevvaru, Telugu Movie News-Movie-Telugu Tollywood Photo Image

దర్శకుడు అనిల్ రావిపూడి ఈ సినిమాను పూర్తి కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించడంతో ఈ సినిమాను చూసేందుకు జనాలు థియేటర్లకు ఎగబడ్డారు.

మహేష్ పవర్‌ప్యాక్డ్ పర్ఫార్మెన్స్‌కు అనిల్ రావిపూడి టేకింగ్, రష్మిక అందాల ఆరబోతతో పాటు కామెడీ టైమింగ్ తోడవ్వడంతో ఈ సినిమా క్లాస్, మాస్ అని తేడా లేకుండా ప్రేక్షకులను అలరించింది.

లేడీ సూపర్ స్టార్ విజయశాంతి రీఎంట్రీ కూడా ఈ సినిమాకు బాగా కలిసొచ్చిన అంశం.ఈ సినిమాలోని పాటలు, ఫైట్లు కూడా ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో ఈ సినిమా కలెక్షన్ల జోరు ఇంకా కొనసాగుతోంది.

రిలీజ్ అయ్యి 37 రోజుల ముగిసే సరికి ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రూ.138.16 కోట్ల వసూళ్లను సాధించింది.బన్నీ అల వైకుంఠపురములో సినిమా పోటీలో ఉన్నా ఈ సినిమా మాత్రం కొన్ని వర్గాల ప్రేక్షకులను ఇంకా అలరిస్తూ ఉంది.

ఇక ఏరియాల వారీగా ఈ చిత్ర 37 రోజుల కలెక్షన్లు ఈ విధంగా ఉన్నాయి.

నైజాం – 39.74 కోట్లు

సీడెడ్ – 15.60 కోట్లు

గుంటూరు – 9.95 కోట్లు

ఉత్తరాంధ్ర – 19.83 కోట్లు

ఈస్ట్ – 11.36 కోట్లు

వెస్ట్ – 7.45 కోట్లు

కృష్ణా – 8.90 కోట్లు

నెల్లూరు – 4.05 కోట్లు

టోటల్ ఏపీ+తెలంగాణ – 116.88 కోట్లు

కర్ణాటక – 7.52 కోట్లు

రెస్టాఫ్ ఇండియా – 1.81 కోట్లు

ఓవర్సీస్ – 11.95 కోట్లు

టోటల్ వరల్డ్‌వైడ్ – 138.16 కోట్లు

తాజా వార్తలు

Sarileru Neekevvaru 37 Days Worldwide Collections-collections,mahesh Babu,sarileru Neekevvaru,telugu Movie News Related....