సూపర్ స్టార్ మహేశ్ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్  

Sarileru Neekevvaru 1st Mind Block Release Date-mahesh Babu,mind Block Release Date,sarileru Neekevvaru 1st ,vijayashanthi

అనీల్ రావుపూడి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న సినిమా సరిలేరు నీకెవ్వరు.యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా నుంచి తాజాగా టీజర్ రిలీజ్ అయ్యి ప్రేక్షకులని విశేషంగా ఆకట్టుకుంది.ఇక ఈ సినిమాలో చాలా రోజుల తర్వాత లేడీ సూపర్ స్టార్ విజయశాంతి కీలక పాత్రలో చేస్తూ ఉండటంతో సినిమా మీద భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.అనిల్ రావిపూడి స్టైల్ లో అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా ఉండబోతుంది అని టీజర్ బట్టి అర్ధమైపోయింది.

Sarileru Neekevvaru 1st Mind Block Release Date-mahesh Babu,mind Block Release Date,sarileru Neekevvaru 1st ,vijayashanthi Telugu Tollywood Movie Cinema Film Latest News-Sarileru Neekevvaru 1st Song Mind Block Release Date-Mahesh Babu Mind Date Sarileru Vijayashanthi

ఇక ఈ సినిమాలో మహేష్ కి జోడీగా రష్మిక మందన నటిస్తుంది.

ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ సినిమాలోని ఫస్ట్ సింగిల్ “మైండ్ బ్లాక్” అనే మాస్ సాంగ్ ను రేపు అనగా డిసెంబర్ 2వ తేదీన సాయంత్రం 5 గంటలకి ప్రేక్షకుల ముందుకి తీసుకురాబోతున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది.సంక్రాంతి బరిలో ప్రేక్షకుల ముందుకి రాబోతున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి కూడా డేట్ ఫిక్స్ చేసేసారు.జనవరి 5 వ తేదీన భారీ ఎత్తున ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించాలని, అది కూడా భారీ ఎత్తున జరగాలని మహేష్ బాబు భావిస్తున్నట్లుగా తెలుస్తుంది.మరి భారీ అంచనాల మధ్య పండగకి ప్రేక్షకుల ముందుకి రాబోతున్న ఈ సినిమా అనిల్ రావిపూడి స్టైల్ లో మరో ఫుల్ మీల్స్ సినిమాగా ఉండబోతుందా అనేది చూడాలంటే వేచి చూడాల్సిందే.