సరిలేరు నీకెవ్వరు 13 రోజుల కలెక్షన్లు.. జోరు తగ్గిందిగా!  

Sarileru Neekevvaru 13 Days Collections-mahesh Babu,sarileru Neekevvaru,vijayashanti

సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన తాజా చిత్రం సరిలేరు నీకెవ్వరు రిలీజ్‌కు ముందు ఎలాంటి హైప్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే.ఈ సినిమాతో మహేష్ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తాడని, ఇండస్ట్రీ హిట్ కొడతాడని అందరూ అంచనా వేశారు.

Sarileru Neekevvaru 13 Days Collections-Mahesh Babu Sarileru Vijayashanti

కానీ రిలీజ్ అయిన తరువాత సీన్ మారిపోయింది.

కమర్షియల్ సినిమాలో ఉండాల్సిన అంశాలు అన్నీ ఉండటంతో ఈ సినిమా సూపర్ సక్సెస్ టాక్‌ను తెచ్చుకుంది.

మహేష్ ఎనెర్జిటిక్ పర్ఫార్మెన్స్‌, విజయశాంతి పవర్‌ఫుల్ రీఎంట్రీ, రష్మిక మందన అందాలు, అదిరిపోయే కామెడీ లాంటి అంశాలు ఈ సినిమాకు బాగా కలిసి రావడంతో సినిమాను చూసేందుకు జనాలు ఎగబడ్డారు.సంక్రాంతి సీజన్‌లో రిలీజ్ అయిన తొలి తెలుగు భారీ చిత్రం కావడంతో వారం పాటు సినిమాకు ఎక్కడ చూసినా హౌజ్‌ఫుల్ బోర్డులు దర్శనమిచ్చాయి.

క్రమేనా వీక్‌డేస్‌లో ఈ చిత్ర కలెక్షన్లు తగ్గాయని లెక్కలు చెబుతున్నాయి.ఈ సినిమా 13 రోజలు పూర్తి చేసుకుని రెండు తెలుగు రాష్ట్రాల్లో రూ.104.74 కోట్ల మేర షేర్ వసూళ్లు సాధించింది.అనిల్ రావిపూడి డైరెక్షన్ సినిమాను మంచి విజయం దిశగా తీసుకెళ్లడంలో కీలక పాత్ర పోషించింది.ఇక ఏరియాలవారీగా ఈ సినిమా 13 రోజలు కలెక్షన్లు ఈ విధంగా ఉన్నాయి.

నైజాం – 34.81 కోట్లు

సీడెడ్ – 14.53 కోట్లు

గుంటూరు – 9.26 కోట్లు

వైజాగ్ – 17.83 కోట్లు

ఈస్ట్ – 10.50 కోట్లు

వెస్ట్ – 6.87 కోట్లు

నెల్లూరు – 3.71 కోట్లు

కృష్ణా – 8.23 కోట్లు

టోటల్ ఏపీ+తెలంగాణ – 104.74 కోట్లు

తాజా వార్తలు

Sarileru Neekevvaru 13 Days Collections-mahesh Babu,sarileru Neekevvaru,vijayashanti Related....