ఆ విదేశీ యువతిని తెలుగు కార్ డ్రైవర్ ఎలా బుట్టలో పడేసాడో తెలుసా.? సరిహద్దులు దాటిన ప్రేమ!       2018-06-03   00:15:50  IST  Raghu V

కామారెడ్డికి చెందిన 23 ఏళ్ల యువకుడు బతుకుదెరువు వెతుక్కుంటూ సౌదీ వెళ్లాడు. అక్కడ ఓ బడా వ్యాపారి వద్ద డ్రైవర్‌గా చేరాడు. కారు డ్రైవర్ అయినా.. అతడి ప్రవర్తన నచ్చి ఆ వ్యాపారి కూతురు (27) ఆ యువకుడిపై మనసు పారేసుకుంది. ఆమెను పెళ్లి చేసుకుంటే ఎలాంటి ఇబ్బందులు వస్తాయోనని భయపడి ఆ యువకుడు స్వదేశం వచ్చేశాడు.

సౌదీలోని మ్యారేజ్ రూల్స్ ప్రకారం అక్కడ వివాహం చేసుకోవడం కుదరలేదు. దీంతో అజీముద్దీన్ 2018 జనవరిలో ఇండియాకి తిరిగి వచ్చాడు. అయినప్పటికీ అతడిపై ప్రేమను చంపుకోలేక పోయింది ఆ యువతి. సోషల్ మీడియా ద్వారా చాటింగ్, వీడియో కాల్స్, ఫోన్ మాట్లాడటం ఆపలేదు. ఈ క్రమంలో అజీముద్దీన్ పై పీకల్లోతు ప్రేమలో మునిగిన ఈ సౌదీ అమ్మాయి.. ఎలాగైనా ప్రియుడితోనే కలిసి జీవించాలని నిర్ణయించుకుంది. ఇండియాకు రావాలనకుంది. సౌదీలోని తన ఇంటి నుంచి అదే అడ్రస్ తో వీసాకు అప్లై చేస్తే విచారణలో ఈ విషయం తల్లిదండ్రులకు తెలుస్తుందని భయపడింది. దీంతో తన ప్రేమ విషయం బయటపడితే ఇండియాకు రావడం వీలుకాదని భావించిన ఆ యువతి.. మే నెలలో టూర్ కు వెళ్తున్నాని ఇంట్లో చెప్పి, నేపాల్ కు చేరుకుంది.

అక్కడి నుండి అక్రమంగా సరిహద్దులు దాటి ఇండియాలోకి ప్రవేశించింది. రోడ్డు, రైలు మార్గంలో హైదరాబాద్ చేరుకుని, అక్కడి నుంచి నిజామాబాద్ లో ఉంటున్న ప్రియుడు అజీముద్దీన్ ను కలుసుకుంది. నంతరం ఇద్దరూ పెళ్లి చేసుకొని కామారెడ్డిలో కాపురం పెట్టారు. ఈలోగా యువతిని వెతుక్కుంటూ వచ్చిన ఆమె తండ్రి తెలంగాణ పోలీసులను ఆశ్రయించడంతో ఈ ప్రేమ కథలో ట్విస్ట్ చోటుచేసుకుంది. సినిమా కథను తలపిస్తున్న ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి.

-

కూతురు కనిపించకపోవడంతో గాలింపు చర్యలు చేపట్టాడు యువతి తండ్రి. భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ ద్వారా.. యువతి తెలంగాణలో ఉన్నట్లు గుర్తించారు. ముంబైలోని సౌదీ ఎంబసీసి ఆశ్రయించిన యువతీ తల్లిదండ్రులు కిడ్నాప్ కేసు పెట్టారు. తన కూతురినీ ఇండియా డ్రైవర్ కిడ్నాప్ చేసి తీసుకొచ్చాడని పోలీసులకు తెలిపారు. దీంతో CCS పోలీసులు స్పెషల్ టీమ్స్ తో రంగంలోకి దిగి, నిజామాబాద్ లో ఉన్నట్లు గుర్తించారు.

వ్యాపారి ఇచ్చిన వివరాల ఆధారంగా పోలీసులు సాంకేతిక పరిజ్ఞానం వినియోగించి శుక్రవారం ఆ యువతీ, యువకులను కనిపెట్టారు. వారిని అదుపులోకి తీసుకొని యువతిని నిజామాబాద్‌ ఎస్పీకి అప్పగించారు. విచారణలో తన ఇష్ట పూర్వకంగానే వచ్చానని యువతి చెప్పింది. అజీముద్దీన్ ఇండియాకు వచ్చిన ఐదు నెలల తర్వాత ఆమె రావడంతో కిడ్నాప్ కాదని తెలిపారు పోలీసులు. ఎంబసీ అధికారుల సమక్షంలో ఆ యువతి తిరిగి సౌదీ వెళ్తానంటేనే.. తండ్రికి అప్పగిస్తామని చెప్పారు పోలీసులు. ఇక్కడే ఉంటానంటే నివసించడానికి అవసరమైన అనుమతులు ఇవ్వాలా.. చట్టపరంగా ఎలాంటి చర్యలు తీసుకోవాలి అనేదానిపై దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు పోలీసులు. మొత్తానికి ప్రేమకు సరిహద్దులు లేవు అని ఈ యువతి నిరూపించింది.