సరిగ్గా ఆ సమయంలో భార్య రావడంతో...ఆ బాలిక బయటపడింది.! అసలేమైంది అంటే.?       2018-07-09   01:46:39  IST  Raghu V

నేటి తరుణంలో ఆడపిల్లకు భద్రతా లేకుండా పోతుంది. అత్యాచారం, లైంగిక వేధింపులు అనే ప‌దాలు విన‌బ‌డ‌డం స‌హ‌జం అయిపోయింది. స‌మాజంలో క్రూర మృగాలు పెరిగిపోయాయి. వాటికి అడ్డు, అదుపూ ఉండ‌డం లేదు. మ‌హిళ‌లు క‌న‌బ‌డితే చాలు రెచ్చిపోతున్నాయి. వారిపై అఘాయిత్యాల‌కు పాల్ప‌డుతున్నాయి. వాటికి క‌న్నూ మిన్నూ క‌నిపించ‌దు. వావి, వ‌రుస, చిన్న‌, పెద్ద అనే తేడాలు ఉండ‌వు. పాశ‌వికంగా దాడి చేయ‌డ‌మే ప‌ని. ఇంటికి వచ్చిన ఓ పదేళ్ల బాలికపై అత్యాచారం చేయబోయాడు ఆ నీచుడు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని బాలాఘట్‌ జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల లోకి వెళ్తే.!

సాకు నీతమ్‌(25)కు కొంతకాలం కిందట వివాహమైంది. వీరు బాలాఘట్‌ జిల్లా బిర్సా ఏరియాలో నివాసం ఉంటున్నారు. ఈ క్రమంలో ఆదివారం వీరి ఇంటికి ఓ 10 ఏళ్ల చిన్నారి వచ్చింది. భార్య ఇంట్లో లేదని గమనించిన భర్త ఆ బాలికపై అత్యాచారం చేయాలని యత్నించాడు. బలవంతంగా బాలిక దుస్తులు విప్పేసి అతడు మృగాడిగా మారిన సమయంలోనే నిందితుడి భార్య ఇంటికి చేరుకున్నారు. చిన్నారిపై జరగబోయే దారుణాన్ని అడ్డుకుని, గట్టిగా కేకలు వేయడంతో తన భర్త పరారయ్యాడని పోలీసులకు ఆమె తెలిపారు.

ఆ బాలిక తల్లితండ్రులు ఆ నీచుడుపై కంప్లైంట్ ఇచ్చారు. నిందితుడు నీతమ్‌ ప్రస్తుతం పరారీలో ఉన్నాడని, అతడి కోసం తమ బృందం గాలింపు చర్యలు చేపట్టిందని వివరించారు. దగ్గిరి బంధువైన ఓ వ్యక్తి కూతురిపై అఘాయిత్యం చేయబోయిన నీతమ్‌పై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు అన్నారు.

,