సరిలేరు నీకెవ్వరు సందడి మొదలయ్యేది ఎప్పుడు?  

Sari Leru Nikevvaru Prmotions Are Not Started-allu Arjun,mahesh Babu,sari Leru Nikevvaru,tollywood

మహేష్‌బాబు హీరోగా రూపొందుతున్న సరిలేరు నీకెవ్వరు చిత్రం షూటింగ్‌ కార్యక్రమాలు చాలా వేగంగా జరుగుతున్నాయి.ప్రస్తుతం కేరళలో చివరి దశ చిత్రీకరణ జరుపుతున్నారు.పెద్ద ఎత్తున అంచనాలున్న ఈ చిత్రం షూటింగ్‌ అయితే చేస్తున్నారు కాని ప్రమోషన్‌ కార్యక్రమాలు అయితే అసలు చేస్తున్న దాఖలాలు కనిపించడం లేదు.

Sari Leru Nikevvaru Prmotions Are Not Started-allu Arjun,mahesh Babu,sari Leru Nikevvaru,tollywood Telugu Tollywood Movie Cinema Film Latest News-Sari Leru Nikevvaru Prmotions Are Not Started-Allu Arjun Mahesh Babu Sari Tollywood

ప్రమోషన్‌ కార్యక్రమాలు చేయకుండానే సినిమాను విడుదల చేయడం ఏంటీ అంటూ అభిమానులు ప్రశ్నిస్తున్నారు.ఒక వైపు సంక్రాంతికి రాబోతున్న బన్నీ మూవీ అల వైకుంఠపురంలో సినిమాకు బీభత్సంగా ప్రచారం చేస్తున్నారు.

అదే రోజు విడుదల చేస్తామంటున్న సరిలేరు నీకెవ్వరు చిత్రానికి మాత్రం ఎలాంటి ప్రచారం చేయకపోవడంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.ఇంతకు సరిలేరు నీకెవ్వరు ప్రమోషన్స్‌ ప్రారంభం అయ్యేది ఎప్పుడు అంటూ మహేష్‌బాబు అభిమానులు చాలా మంది ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

కొందరు మాత్రం సరిలేరు నీకెవ్వరు సినిమాకు అసలు ప్రమోషన్‌ అక్కర్లేదు.సైలెంట్‌గా విడుదల అయినా సెన్షేషన్‌ క్రియేట్‌ చేయడం కన్ఫర్మ్‌ అంటూ ధీమాగా ఉన్నారు.