ప్రపంచ రికార్డు సృష్టించిన చీర.. దాని విశిష్టత అదే

అసలే నక్సలైట్లు అధికంగా సంచరించే ప్రాంతమది.నిత్యం నక్సలైట్లకు, పోలీసులకు మధ్య పోరులో తుపాకులు పేలుతూ ఆ ప్రాంతానికి కంటి మీద కునుకు లేకుండా చేస్తాయి.

 Sari Created A World Record New Record, Saree, Latest New, Viral Latest, News Viral, Social Media-TeluguStop.com

అటువంటి చోట కొందరు మహిళలు అద్భుతాన్ని సృష్టించారు.తమ ప్రతిభను చాటుతూ ఓ భారీ చీరను నేశారు.

దానికి ప్రపంచ రికార్డు కూడా దక్కింది. ఆ మహిళల విజయగాథ, వారు తయారు చేసిన చీర గురించిన వివరాలిలా ఉన్నాయి.

 Sari Created A World Record New Record, Saree, Latest New, Viral Latest, News Viral, Social Media -ప్రపంచ రికార్డు సృష్టించిన చీర.. దాని విశిష్టత అదే-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఛత్తీస్‌గఢ్‌లోని దంతెవాడ జిల్లాలో డానెక్స్ గార్మెంట్ ఫ్యాక్టరీకి చెందిన 300ల మంది మహిళా కార్మికులు రికార్డు సృష్టించారు.‘దంతేశ్వరి దేవి‘ అమ్మవారి కోసం 11 కిలోమీటర్ల పొడవైన ‘చునారి’ చీరను తయారు చేసి ప్రపంచ రికార్డు లిఖించారు.‘భెంట్ ములకత్’ కార్యక్రమం కింద బస్తర్ డివిజన్ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్ మంగళవారం దంతేశ్వరి దేవతకు ప్రత్యేకంగా నేసిన చునారీని సమర్పించారు.దంతెవాడ రోడ్లపై దంతేశ్వరి అమ్మవారి మహా చునారీనీ ప్రదర్శించారు.11 కిలోమీటర్ల పొడవు కావడంతో ఈ చీరకు గోల్డెన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో కూడా చోటు దక్కింది.అంతకుముందు ఇదే తరహాలో మధ్యప్రదేశ్‌లోని మందసౌర్‌లో నర్మదా దేవి అమ్మవారికి పొడవైన చునారీని సమర్పించారు.

ఈ చునారి 8 కిలోమీటర్ల పొడవు ఉంది.

11 కిలోమీటర్ల పొడవైన అందమైన చునారీని డానెక్స్ గార్మెంట్ ఫ్యాక్టరీకి చెందిన 300 మంది మహిళా సిబ్బంది వారం రోజుల వ్యవధిలో తయారు చేశారని జిల్లా కలెక్టర్ దంతెవాడ దీపక్ సోనీ తెలిపారు.దంతెవాడలోని డానెక్స్‌ గార్మెంట్‌ ఫ్యాక్టరీని సందర్శించిన సీఎం బఘెల్‌, కార్మికులు ఇలాంటి కళాఖండాన్ని సృష్టించడంతోపాటు తయారీ, మార్కెటింగ్‌ రంగంలో సాధించిన విజయాలను అభినందించారు.గత 16 నెలల్లో డానెక్స్ నాలుగు తయారీ యూనిట్లు రూ.50.6 కోట్ల వ్యాపారం చేశాయని, డానెక్స్ బ్రాండ్ క్లాత్, గార్మెంట్, ఇతర ఉత్పత్తులు భారతదేశం అంతటా విక్రయించబడ్డాయని చెప్పారు.ఈ కంపెనీ 800 మందికి ఉద్యోగాలు కల్పించిందని పేర్కొన్నారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube