డైరెక్టర్ పి.ఎస్ మిత్రన్ దర్శకత్వంలో రూపొందిన సినిమా సర్దార్.
ఇందులో కార్తీ, రాశిఖన్నా, రజిషా విజయన్, చుంకీ పాండే, సిమ్రాన్, మునిష్కాంత్, మురళి శర్మ తదితరులు నటించారు.ఇక ఈ సినిమాకు ఎస్ లక్ష్మణ్ కుమార్ నిర్మాతలుగా బాధ్యతలు చేపట్టాడు.
జి.వి ప్రకాష్ కుమార్ సంగీతం అందించాడు.జార్జ్ సి.విలియమ్స్ సినిమాటోగ్రఫీ అందించాడు.అయితే ఈ సినిమా ఈరోజు ప్రేక్షకుల ముందుకు రాగా ఈ సినిమా ప్రేక్షకులను ఎలా ఆకట్టుకుందో చూద్దాం.ఇక వరుస సక్సెస్ లతో దూసుకుపోతున్న కార్తీ కు ఈ సినిమా ఎటువంటి సక్సెస్ అందిస్తుందో చూద్దాం.
కథ:
ఇందులో కార్తీ విజయ్ ప్రకాష్ పాత్రలో కనిపిస్తాడు.విజయ్ ప్రకాష్ ఒక పోలీస్ అధికారి.
ఇక విజయ ప్రకాష్ కు మీడియా ముందు ఎప్పుడు ట్రెండింగ్ లో ఉండాలి అని ఉంటుంది.ఇక దానికోసం ఏదైనా చేస్తాడు విజయ్ ప్రకాష్.
అయితే ఓసారి ఆంధ్ర యూనివర్సిటీ నుండి ముఖ్యమైన ఫైల్ కనిపించకపోయేసరికి కథ మలుపు తిరుగుతుంది.అయితే అందులో సైనిక రహస్యాలు ఉన్నాయని తెలుస్తాయి.
దీంతో సీబీఐ, రా అధికారులు వెతుకుతుంటారు.ఇక విజయ ప్రకాష్ కి ఈ విషయం తెలియడంతో అతడు మరింత ఫేమ్ కావాలి అని ఫోబియా కారణంగా అతడు రా ఇంటలిజెన్స్ కంటే ముందు ఫైల్ ను కనుక్కోవడానికి ప్రయత్నిస్తాడు.
ఇక ఆ సమయంలో విజయ్ ప్రకాష్ కి తన తండ్రి సర్దార్ గురించి ఒక విషయం తెలుస్తుంది.పైగా అతని మిషన్ గురించి కూడా తెలుస్తుంది.
దీంతో విజయ ప్రకాష్ ఆ మిషన్లో ఎలా భాగం అయ్యాడు.చివరికి ఆ ఫైల్ గురించి ఏం కనుక్కుంటాడు అనేది మిగిలిన కథలోనిది.
నటినటుల నటన:
కార్తీ నటన గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు.తన పాత్రతో మరోసారి ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు.ఇక రాశిఖన్నా కూడా అద్భుతంగా నటించింది.మిగతా నటీనటులంతా తమ పాత్రకు పూర్తి న్యాయం చేశారు.
టెక్నికల్:
దర్శకుడు మంచి కథను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చాడు.ఈ సినిమాతో ప్రేక్షకులను మరింత మెస్మరైజ్ చేయాలని చూశాడు.
కానీ అక్కడక్కడ కొన్ని సన్నివేశాలు మిస్ అయినట్లు అనిపించాయి.ఇక సంగీతం పరవాలేదన్నట్టుగా ఉంది.
సినిమాటోగ్రఫీ బాగుంది.మిగిలిన టెక్నికల్ విభాగాలు బాగా పని చేశాయి.
విశ్లేషణ:
మొదట సినిమా మొత్తం ఇంట్రెస్టింగ్ సీక్వెన్స్ తో సాగగా.రాను రాను అక్కడక్కడ లోపాలు కనిపించాయి.ఫస్టాఫ్ మొత్తం చాలా ఇంట్రెస్టింగ్ గా సాగింది.ఇక సెకండ్ హాఫ్ నెమ్మదిగా అనిపించినట్లు కనిపించింది.కానీ క్లైమాక్స్ మాత్రం బాగా అదిరిపోయింది.
ప్లస్ పాయింట్స్:
ఎమోషనల్, నటీనటుల నటన, యాక్షన్ సన్నివేశాలు, కథ, స్క్రీన్ ప్లే, బ్యాక్గ్రౌండ్ స్కోర్.
మైనస్ పాయింట్స్:
సెకండ్ హాఫ్ లో కొన్ని సన్నివేశాలు సాగదీసినట్లుగా అనిపించాయి.
బాటమ్ లైన్:
చివరిగా చెప్పాల్సిందేంటంటే ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉందని చెప్పవచ్చు.