పవన్ వల్ల మహేష్ కి నష్టం

అవును, మీరు విన్నది నిజమే.పవర్ స్టార్ వలన సూపర్ స్టార్ కి నష్టం జరుగుతోంది.

 Sardaar Result Effecting Brahmotsavam Business-TeluguStop.com

అయితే ఇదంతా పవన్ కావాలని చేస్తున్నది కాదు.అనుకోకుండా జరిగిపోయింది.

అసలేం జరిగింది అని మీరు కన్ఫ్యూజ్ కాకముందే మ్యాటర్ లోకి వెళదాం.సర్దార్ గబ్బర్ సింగ్ బాక్సాఫీస్ దగ్గర ఘోరంగా విఫలమవడంతో , ఈ ప్రభావం బ్రహ్మోత్సవం బిజినెస్ మీద పడుతోంది.

సర్దార్ గబ్బర్ సింగ్ ని గుడ్డిగా, భారి రెట్లు పెట్టి కొన్నారు పంపిణిదారులు.పవన్ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ అయిన అత్తారింటికి దారేది టోటల్ కలెక్షన్ల కన్నా ఎక్కువ బిజినెస్ చేసింది సర్దార్.

తెలుగు , హిందీ థియేటరికల్ రైట్స్ కలుపుకొని దాదాపు వంద కోట్ల బిజినెస్ చేసిన సర్దార్ , ఇప్పుడు 50 కోట్ల కలెక్షన్లు రాబట్టడం కూడా అనుమానంగా మారింది.ఈ దెబ్బతో బయ్యర్లకి బుద్ధి వచ్చింది.

బ్రహ్మోత్సవం చిత్రాన్ని భారి రేట్లకు కొనే ప్రసక్తే లేదు అని భీష్మించి కూర్చుకున్నారట.ఓవర్సీస్, ఈస్ట్ లాంటి ఏరియాల్లో ఇప్పటికే రికార్డు బిజినెస్ చేసిన బ్రహ్మోత్సవం మిగితా ఏరియాల్లో రికార్డు బిజినెస్ చేయడం కష్టం.

ఇది బయ్యర్లకే మంచిది.సినిమా హిట్ అయితే భారి లాభాలు రాబట్టవచ్చు.

ఇక నుంచి బయ్యర్లు ఇలానే జాగ్రత్తగా ఉండి, కేవలం స్టార్ ని గుడ్డిగా నమ్మకుండా ఉంటే, సిని ఇండస్ట్రీకి చాలా మంచిది.అయినా, సినిమా ఎంత కలెక్ట్ చేసింది అనే రికార్డు గురించి పట్టించుకోవాలి కాని, సినిమాకి ఎంత బిజినెస్ జరిగింది లాంటివి ఎందుకు మన హీరోలకి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube