బిగ్ బాస్ హౌస్ లో ఆ ఒక్కరు తప్ప అందరూ ఫేక్.. సరయు కామెంట్స్ వైరల్?

Sarayu Roy Supports Anchor Ravi In Bigg Boss 5 Telugu

బిగ్ బాస్ ఫేమ్, 7 ఆర్ట్స్ సరయు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఇటీవలే ఈమె బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చి మొదటి వారమే ఎలిమినేట్ అయిన విషయం కూడా మనందరికీ తెలిసిందే.

 Sarayu Roy Supports Anchor Ravi In Bigg Boss 5 Telugu-TeluguStop.com

ఈమె యూట్యూబ్ లో పలు వీడియోస్ ద్వారా బాగా ఫేమస్ అయింది.నోరు తెరిస్తే చాలు బూతులు, ఆ బూతు లతోనే ఈమె బాగా పాపులర్ అయి బిగ్ బాస్ హౌస్ లోకి కూడా ఎంట్రీ ఇచ్చింది.

అయితే ఆమెకు ఉన్న నెగిటివిటీ కారణంగా ఈమె మొదటి వారం తట్ట బుట్ట సర్దుకుని బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చేసింది.

 Sarayu Roy Supports Anchor Ravi In Bigg Boss 5 Telugu-బిగ్ బాస్ హౌస్ లో ఆ ఒక్కరు తప్ప అందరూ ఫేక్.. సరయు కామెంట్స్ వైరల్-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

బిగ్ బాస్ హౌస్ లో సిగరెట్లు తాగడం, కారణం లేకుండా కాజల్ ను టార్గెట్ చేయడం వంటి వాటితో ఈమె మొదటి వారంలోనే ఎలిమినేట్ అయి బయటికి వచ్చేసింది.

ఈమె బయటకు వచ్చిన తర్వాత బిగ్ బాస్ కంటెస్టెంట్ లతో మంచిగానే ర్యాపో చేస్తుంది.లోబో, నటరాజ్, ఉమాదేవి, సరయులు అందరూ కలిసి బాగానే ఎంజాయ్ చేస్తున్నారు.

ఇది ఇలా ఉంటే సరయూ తాజాగా యాంకర్ రవి గురించి స్పందించింది.

Telugu Anchor Ravi, Kajl, Lobo, Natraj, Sarayu, Achor Ravi, Umadevi-Movie

ఈ క్రమంలోనే రవి గురించి ఒక పోస్టు పెట్టింది.అయితే రవి ఎలిమినేట్ అయ్యాడని అలాంటి పోస్ట్ పెట్టిందా? లేకపోతే రవి ఇంకా హౌస్ లోనే ఉంటాడని ఆ పోస్టు పెట్టిందో తెలియదు గానీ, రవికి సపోర్ట్ చెయ్యండి అంటూ కోరింది.బిగ్ బాస్ హౌస్ లో ఇప్పుడున్న వారంతా కూడా ఫేక్.

ఒక్క రవి తప్ప అని సరయు చెప్పుకొచ్చింది.రవికి మద్దతు తెలపండి అంటూ తన ఫ్యాన్స్ ని వేడుకుంది.

అయితే రవి గురించి ఈమె చేసిన కామెంట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

#Sarayu #Lobo #Achor Ravi #Natraj #Kajl

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube