లెజెండ్ శరవణన్ ఇప్పుడు హీరో అయిపోయాడు  

Saravana Stores owner turns hero - Telugu \\'legend\\' Saravanan, Kollywood, Saravana Stores Owner, Turns Hero

శరవణనన్ అంటే తమిళనాడులో తెలియని వారు ఉండరంటే అతిశయోక్తి కాదు.శరవణ స్టోర్స్ అధినేతగా ఉన్న ఇతను స్టార్ హీరోయిన్స్ ని తన షాపింగ్ మాల్ యాడ్స్ కోసం కోట్ల రూపాయిలు రెమ్యునరేషన్ ఇచ్చి తీసుకొస్తూ ఉంటాడు.

Saravana Stores Owner Turns Hero

అయితే వాళ్ళతో మాత్రమే తానె నటిస్తాడు.తన షాపింగ్ మాల్ ప్రమోషన్ కి తనో మోడల్ గా మారిపోతాడు.

ఇక శరవణన్ తో తమిళనాడులో స్టార్ హీరోయిన్స్ గా ఉన్న హన్సిక, తమన్నా లాంటి స్టార్స్ కూడా నటించారు.కామెడీ పేస్ పెట్టుకొని తాను చేసే యాడ్స్ కి సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది.

ఓ విధంగా చెప్పాలంటే తనని తాను హీరోగా ఫీల్ అయ్యే శరవణన్ ఇప్పుడు ఏకంగా సినిమాలో హీరోగా కూడా నటించేస్తున్నాడు.తాజాగా ఈ సినిమా ప్రారంభోత్సవం జరిగింది.

ఇక ఈ సినిమాకి ఇద్దరు దర్శకులని శరవణన్ ఫైనల్ చేసాడు.వారి పేర్లు జేడీ, జెర్రీ.

అతడి సరసన హీరోయిన్ గా స్టార్ హీరోయిన్ ని ట్రై చేసిన ఎవరు చేయడానికి ముందుకి రాకపోవడంతో ఇప్పుడు అందమైన మోడల్ ని ఫైనల్ చేసినట్లు తెలుస్తుంది.ఇప్పటి వరకు ఇతను యాడ్స్ తో ఆడియన్స్ ని టార్చర్ చేయగా ఇప్పుడు ఏకంగా హీరోగా అంటే తమిళ ఆడియన్స్ ఎంత వరకు భరిస్తారో అనేది వేచి చూడాల్సిందే.

#Turns Hero #Kollywood

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Saravana Stores Owner Turns Hero Related Telugu News,Photos/Pics,Images..