హీరోగా ఎదిగాడు... విలన్ గా ఒదిగాడు! దోశ కింగ్ జీవితం ఒక పాఠం  

Saravana Bhavan Founder P Rajagopal Dies -

చాలా మంది సమాజంలో సామాన్య, మధ్య తరగతి కుటుంబం నుంచి తమ సామర్ధ్యంతో, స్వశక్తితో ఉన్నత స్థానాలకి ఎదుగుతారు.ఈ ఎదుగుదలతో ఎంతో మందికి ఆదర్శంగా మారుతారు.

Saravana Bhavan Founder P Rajagopal Dies

కాని ఎదిగిన తర్వాత వచ్చిన గుర్తింపుని నిలుపుకోవడంలో కూడా చాలా సామర్ధ్యం ఉండాలి.ఒక్కోసారి ఎదుగుదలతో వచ్చిన కీర్తి తప్పులు చేసేలా చేస్తుంది.

అలాంటి తప్పులు చేయకుండా ఉంటే ప్రజలు వారిని అత్యున్నత స్థానంలో చూస్తూ ఆదర్శంగా చెప్పుకుంటారు.అయితే కొందరు మాత్రం దారి తప్పి తప్పుడు పనులు చేసి సంపాదించుకున్న కీర్తి మొత్తం పోగొట్టుకుంటారు.

ఇప్పుడు అలాంటి కోవలోకి దోశ కింగ్ శరవణ భవన్ అధినేత శరవణన్ రాజగోపాల్ వస్తాడు.తన స్వశక్తితో ఎదిగిన శరవణన్ రాజగోపాల్ తన ఎదుగుదలకి తానే కారణం అనే విషయాన్ని మరిచిపోయి జ్యోతీష్యం, జాతకాలు ఎక్కువగా నమ్మేవాడు.

ఈ కారణంగా రెండు సార్లు పెళ్లి చేసుకున్న అతను మరల ఓ యువతితో మూడో పెళ్లికి సిద్ధమయ్యాడు.ఆ యువతి తన హోటల్ లో పని చేసేది.

ఆమెని చేసుకుంటే మరింత ఎదుగుదల ఉంటుంది అని భావించి పెళ్లి చేసుకునే ప్రయత్నం చేసాడు.అయితే ఆమె అప్పటికే ఆ హోటల్ లో పనిచేసే మరో వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకోవడంతో వారిద్దరిని విడదీసి అమ్మాయిని సొంతం చేసుకోవాలని పథకం వేసి ఆమె ప్రేమించిన వాడిని కిరాయి హంతకులతో హత్య చేయించాడు.

అయితే ఆ హత్యని పోలీసులు సీరియస్ గా తీసుకోవడంతో పాటు అమ్మాయి కూడా గట్టిగా పోరాటం చేయడంతో శరవణన్ ముద్దాయిగా నిరూపణ అయ్యింది.దీంతో కోర్ట్ అతనికి యావజ్జీవ కారాగార శిక్ష వేసింది.

ఇక చిన్న వయసు నుంచి కష్టపడి తెచ్చుకున్న పేరు ప్రతిష్టలు పోవడంతో పాటు, సమాజం మొత్తం తనని విలన్ గా చూడటంతో తీవ్ర మనోవేదనకి గురైన అతను అనారోగ్యంతో మృతి చెందడం ద్వారా అతని కథ ముగిసిపోయింది.అలా హీరోగా మొదలెట్టిన జీవితాన్ని శరవణన్ విలన్ గా ముగించాడు అని చెప్పాలి.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు